Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ తర్వాత ఇస్మార్ట్ హీరోకే ఆ సత్తా ఉందట!
By: Tupaki Desk | 7 April 2020 6:30 PM GMTలాక్ డౌన్ ప్రకటించక ముందు నుంచే సినిమా థియేటర్లు అన్నీ మూతపడ్డాయి. సింగిల్ స్క్రీన్.. మల్టిప్లెక్స్ అనే తేడా లేకుండా అన్నీ ప్రస్తుతం క్లోజ్ చెయ్యడం తో సినిమా ప్రదర్శనలకు ఆటంకం ఏర్పడింది. కొత్త రిలీజులను కూడా ఫిలిం మేకర్లు వాయిదా వేశారు. లాక్ డౌన్ ఎప్పుడు సడలిస్తారు?.. సినిమా థియేటర్లను ఓపెన్ చేసేందుకు ఎప్పుడు అనుమతి ఇస్తారు అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆలోపు సినిమా థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై ఇప్పటికే మల్టిప్లెక్స్ చెయిన్ మేనేజ్మెంట్స్ కసరత్తులు చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే.. సినిమా హాల్స్ రీ-ఓపెన్ చేసిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా.. రారా? గతంలో మాదిరిగా గుంపులుగా థియేటర్లలోకి అనుమతించే అవకశం ఉండదు కాబట్టి కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో సందేహాలు టాలీవుడ్ ప్రముఖులకు ఉన్నాయి.
లాక్ డౌన్ సడలించిన తర్వాత రిలీజుకు సిద్ధంగా చాలా సినిమాలే ఉన్నాయి కానీ వాటిలో ఏ సినిమా మాస్ ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించగలదు అనే విషయంపై కూడా ఫిలిం సర్కిల్స్ లో చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాల్లో ప్రముఖంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమా 'రెడ్' పేరు వినిపిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ రఫ్ గా కనిపిస్తున్నాడు. రీమేక్ సినిమా కావడంతో కథ కూడా ఇంటెన్స్ గా ఉంటుందని..మాస్ ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సత్తా ఈ సినిమాకు ఉందని చాలామంది అభిప్రాయం.
అయితే ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే చిక్కేంటంటే దర్శకుడు కిషోర్ తిరుమల హీరోయిన్లను ప్రెజెంట్ చేసే విధానం. తను హీరోయిన్లను మరీ సాఫ్ట్ గా చూపిస్తాడు. నో మసాలా.. నో గ్లామర్ అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. నివేద పేతురాజ్.. మాళవిక శర్మ.. అమృత అయ్యర్. వీరిలో మాళవిక శర్మమొదటి నుంచి హాటు ఘాటు భామే కాబట్టి గ్లామర్ టచ్ ఇస్తే ఈ సినిమా మరో 'ఇస్మార్ట్ శంకర్' అయినా ఎవరూ సంభ్రమాశ్చర్యాలకు గురి కావాల్సిన పనిలేదని అంటున్నారు.