Begin typing your search above and press return to search.

రామ్‌ 'రెడ్‌' ప్రమోషన్స్‌ షురూ

By:  Tupaki Desk   |   3 Oct 2020 10:30 AM GMT
రామ్‌ రెడ్‌ ప్రమోషన్స్‌ షురూ
X
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ నటించిన 'రెడ్‌' సినిమా షూటింగ్‌ లాక్‌ డౌన్‌ కు ముందే దాదాపుగా పూర్తి అయ్యింది. సినిమాను సమ్మర్‌ లో విడుదల చేయాలని భావించారు. కాని లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు ఏడు నెలల పాటు థియేటర్లు ఓపెన్‌ అవ్వలేదు. దాంతో సినిమాలను ఓటీటీ ద్వారా విడుదలకు రెడీ అయ్యారు. కొందరు మాత్రం ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఆసక్తి చూపించలేదు. రెడ్‌ సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మూడు నెలలుగా ప్రచారం జరుగుతుంది. కాని మేకర్స్‌ మాత్రం ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపించలేదు. థియేటర్ లు ఎప్పుడు ఓపెన్‌ అయితే అప్పుడు సినిమాను విడుదల చేయాలని భావించారు.

ఎట్టకేలకు కేంద్రం ఈనెల 15న సినిమా థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దాంతో రామ్‌ రెడ్‌ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల చివరి వారంలో లేదా అంతకు ముందే థియేటర్లలో రెడ్‌ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. కేంద్రం నుండి అనుమతులు వచ్చినా తెలుగు రాష్ట్రాల నుండి థియేటర్ల ఓపెన్‌ కు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. ఆ అనుమతులు కూడా వచ్చిన తర్వాత రెడ్‌ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వనున్నారు. మరో వైపు సినిమా టీజర్‌ మరియు ట్రైలర్‌ లను వరుసగా విడుదల చేయడంతో పాటు పాటలను విడుదల చేయడం ద్వారా సోషల్‌ మీడియాలో సందడి చేయాలని భావిస్తున్నారు.