Begin typing your search above and press return to search.

రెమ్యూనరేషన్ గురించి రామ్ చెప్పిన సీక్రెట్

By:  Tupaki Desk   |   5 Jan 2016 10:20 AM GMT
రెమ్యూనరేషన్ గురించి రామ్ చెప్పిన సీక్రెట్
X
మన హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటారనే విషయం ఎప్పుడూ ఆసక్తి రేపేదే. గత కొన్నేళ్లలో మన హీరోల పారితోషకాలు బాగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు 15 కోట్ల మార్కును కూడా దాటేశారు. నాని లాంటి మీడియం రేంజి హీరో కూడా నాలుగు కోట్ల దాకా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ సినిమాకు ఎంత తీసుకుంటాడా అని అతడి అభిమానుల్లోనూ సందేహం ఉంది. ఈ సంగతే రామ్ దగ్గర ప్రస్తావిస్తే.. ఆ లెక్కెంతో చెప్పలేదు కానీ, తనకు ప్రొడ్యూసర్లు ఎప్పుడూ పూర్తి పారితోషకం ఇవ్వరంటూ ఆసక్తికర విషయం చెప్పాడు రామ్.

తన పన్నెండేళ్ల కెరీర్లో ఇప్పటిదాకా ఒకే ఒక్క సినిమాకు మాత్రం తాను పూర్తి పారితోషకం అందుకున్నానని.. ఆ నిర్మాత ఎవరన్నది తాను చెప్పనని అన్నాడు రామ్. మిగతా సినిమాలన్నింటికీ పారితోషకంలో కోత పడిందన్నాడు. రామ్ ఇప్పటిదాక 13 సినిమాలు చేశాడు. అందులో ఆరు తన పెదనాన్న స్రవంతి రవికిషోర్ బేనర్ లో చేసినవే. ఒకవేళ పూర్తి పారితోషకం అందుకున్నది స్రవంతి బేనర్లోని సినిమాకే అయినప్పటికీ.. ఆయన కూడా ఐదు సినిమాల వరకు రామ్ కు అన్యాయమే చేశాడన్నమాట. గత ఏడాది రామ్ నటించిన ‘పండగ చేస్కో’ సినిమాకు నిర్మాత పరుచూరి కిరీటితో రెమ్యూనరేషన్ విషయంలో రామ్ గొడవ పడ్డాడని వార్తలొచ్చాయి. ఆ సందర్భంగా అతడి పారితోషకం రూ.3 కోట్లని వినిపించింది.