Begin typing your search above and press return to search.

రామ్ లుక్ ‘జిందగీ’ కోసం కాదట

By:  Tupaki Desk   |   24 Oct 2017 10:50 AM GMT
రామ్ లుక్ ‘జిందగీ’ కోసం కాదట
X
కెరీర్లో చాలా వరకు ఒకే రకమైన లుక్ లో కనిపిస్తూ వచ్చిన యువ కథానాయకుడు రామ్.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ కోసం కొత్త అవతారంలోకి మారాడు. జుట్టు.. మీసం.. గడ్డం బాగా పెంచి.. డిఫరెంట్ హేర్ కట్ తో కంప్లీట్ న్యూ లుక్ లోకి మారాడు రామ్. దీంతో పాటు కండలు కూడా కొంచెం పెంచాడు. ఇలాంటి లుక్ లో రామ్ ను చూసి అందరూ షాకయ్యారు. ఐతే ఈ లుక్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ కోసం ట్రై చేసింది కాదట. ‘హైపర్’ సినిమా తర్వాత దొరికిన విరామంలో కొత్తగా ఉంటుందని ఇలా వేరే లుక్ ట్రై చేశానని.. వేరే సినిమాకు అది సెట్టవుతుందని అనుకున్నానని.. కానీ ఇంతలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ కథను కిషోర్ తిరుమల చెప్పి.. ఆ సినిమాకు ఈ లుక్ సరిపోతుందని అనడంతో అలాగే కంటిన్యూ అయిపోయానని రామ్ చెప్పాడు.

ఇక ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా గురించి స్పందిస్తూ.. ‘‘ఇది స్నేహం ప్రధానంగా సాగే కథ. సినిమా అంతా స్నేహం చుట్టూనే సాగుతుంది. మధ్యలో ప్రేమకథ యాడ్ అవుతుంది. బాల్యం.. కాలేజ్ లైఫ్.. ఆ తర్వాత పరిణతి సాధించాక వచ్చే జీవితం.. ఇలా మూడు దశల నేపథ్యంలో సాగుతుంది. ఇంతకుముందు కిషోర్ దర్శకత్వంలో చేసిన ‘నేను శైలజ’లో నా పాత్రకు.. ఇప్పుడు తనతో చేసిన ‘ఉన్నది ఒకటే జిందగీ’లోని నా పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. వేటికవే భిన్నమైన క్యారెక్టర్లివి. లైఫ్ అంటే చాలా ఈజీ.. కానీ మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనే ఆలోచనతో ఉండే పాత్ర ఇది. ‘నేను శైలజ’తో కిషోర్ ఏంటో కొంచెం తెలిసింది. ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యాడు. అతడికి ఎంత ఎక్కువ బాధ్యత అప్పగిస్తే అంత బాధ్యతాయుతంగా పని చేస్తాడు. మా ఇద్దరి కెరీర్లలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ మరో ప్రత్యేకమైన సినిమా అవుతుంది’’ అని రామ్ చెప్పాడు.