Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : రామ్ సేతు విధ్వంసానికి కుట్ర చేసిందెవరు?
By: Tupaki Desk | 11 Oct 2022 8:26 AM GMTబాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ 'రామ్ సేతు'. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించాడు. కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అబుడాంటియా ఎంటర్ టైన్ మెంట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ద్వారా టాలీవుడ్ హీరో సత్యదేవ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. శ్రీలంకర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బారుచా హీరోయిన్ లుగా నటించారు.
రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో తాజాగా మంగళవారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. అక్టోబర్ 25న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. రామ సేతుని ధ్వంసం చేయడానికి దుష్ట శక్తులు ప్లాన్ చేస్తున్న విజువల్స్ తో ట్రైలర్ మొదలైంది.'ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తోంది. ఆ నమ్మకాన్ని నేను ఎలా సవాల్ చేయగలుగుతాను.. అంటూ నాజర్ వాయిస్.. ప్రభుత్వం వారు రామసేతుని కూల్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిని కోరారు.. అంటూ లాయర్ చెబుతున్న డైలాగ్ లు సినిమా కథ ఏంటో.. దేని పై సాగుతుందో స్పష్టం చేస్తున్నాయి.
ఇంత వరకు ఎవరూ టచ్ చేయని కథ ఇది. కంటెంట్, అందుకు సంబంధించిన విజువల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రామాయణ గాథలో రామ సేతు గురించి చాలా మంది విన్నారు. ఎవరు కట్టారన్నది పలు సినిమాల్లో .. పురాణాలలో చదివారు. అలాంటి ఆసక్తికరమైన అంశం నేపథ్యంలో 'రామ్ సేతు'ని తెరకెక్కించిన తీరు సినిమాపై ప్రతీ ఒక్కరిలోనూ అంచనాల్ని, ఆసక్తిని పెంచేస్తోంది. రామ్ సేతు విధ్వంసం ఎవరు చేయాలనుకుంటున్నారు?
దాన్ని అరికట్టడానికి ఏర్పాటు చేసిన మిషన్ ఏంటీ?.. ఇందు కోసం మిషన్ ని మొదలు పెట్టిన సభ్యులు ఏం సాధించారు? భారతదేశ వారసత్వాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నది ఎవరు? అనే ఆసక్తికర ప్రశ్నలకు చక్కని సమాధానంగా ఈ సినిమా నిలుస్తుందని తెలుస్తోంది.
నాజర్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడం ఖాయం అని చెబుతున్నారు. ఇంతకీ 'రామ్ సేతు'లో ఏం చెబుతున్నారు? .. సినిమా ఎలా వుండబోతోంది? ఎలాంటి కొత్త విషయాన్ని బయటపెట్టబోతోందన్నది తెలియాలంటే ఈ నెల 25 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.