Begin typing your search above and press return to search.
రామ్-సీత పాత్రల క్రేజ్ తో హను ప్లాన్ నెక్స్ట్ లెవల్లో!
By: Tupaki Desk | 12 Aug 2022 7:14 AM GMTదుల్కార్ సల్మాన్-మృణాల్ ఠాకూర్ నాయకానాయికలుగా హను రాఘవపూడి దర్శకత్వంలో రిలీజ్ అయిన 'సీతారామం' ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. సీత-రామ్ పాత్రలకు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఆ రెండు పాత్రలకు వస్తోన్న గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది. ఎమోషనల్ గా కథని మలచడంలో దర్శకుడు వందశాతం సక్సెస్ అవ్వడం సినిమాను ఈ స్థాయిలో నిలబెట్టింది.
మరి ఇప్పుడు సీత-రామ్ పాత్రల క్రేజ్ ని సైతం డైరెక్టర్ ఎన్ క్యాష్ చేసుకోబోతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ రెండు పాత్రలతో వచ్చిన క్రేజ్ తో ఇదే కాంబినేషన్ లో మరో సినిమా చేస్తానని అంటున్నాడు హను. లవ్ స్టోరీలకు సీక్వెల్స్ చేయడం బాలీవుడ్ కి తప్ప మిగతా పరిశ్రమల్లో వర్కౌట్ కాదు. ఈ విషయాన్ని గ్రహించిన హను సీతారామంకి సీక్వెల్ బధులుగా...ఆ పాత్రలకి వచ్చిన గుర్తింపు తో ఓ కొత్త కథతో మరో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ చేస్తానంటున్నాడు.
హను లవ్ స్టోరీ లు రాయడంలో దిట్ట. అతనిపై మణిరత్నం ప్రభావం ఉంటుంది. అతని ప్రతీ కథ వెనుక 'గీతాంజలి' స్ఫూర్తి కనిపిస్తుంది. ఈ విషయాన్ని హను చాలా సందర్భాల్లో రివీల్ చేసారు. ఇప్పుడు దుల్కార్-మృణాల్ తో మరో సినిమా అంటే? అతని స్టోరీ థాట్ ప్రోసస్ కూడా ఎంతో ఇన్నోవేటివ్ గా ఉండటానికి ఛాన్స్ ఉంది.
రోటీన్ లవ్ స్టోరీలకు హను ఎప్పుడూ దూరమే . లవ్ స్టోరీలోనూ ఓ యూనిక్ పాయింట్ ఉండేలా చూసుకుంటాడు. అదే కథని ఆద్యంతం గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో నడపడానికి చూస్తుంటారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలని ట్రై చేస్తారు. ఇలాంటి ప్రయత్నాలు కొన్ని సార్లు ఫెయిలైనా? ఇంకొన్ని సార్లు 'సీతారామం' లాంటి సక్సెస్ ల్ని అందిస్తాయి.
అందుకే మరోసారి ఆ పాత్రల క్రేజ్ తో అదే కాంబినేషన్ లో మరో సినిమా తప్పకుండా చేస్తానంటున్నాడు. అలాగే దుల్కార్ సల్మాన్ కూడా సినిమా ఫలితం విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నాడు. వైజయంతీ లాంటి బ్యానర్లో పనిచేయడం ఓ కొత్త అనుభూతినిచ్చిందంటున్నాడు.
సినిమా అనే కుటుంబం ఎలా ఉంటుందో ఈ బ్యానర్లో సినిమా చేసిన తర్వాత తెలిసిందంటున్నాడు. ఇక మృణాల్ డైరెక్టర్ విషయంలో ఎంత పాజిటివ్ గా ఉందో తెలిసిందే. కాబట్టి మళ్లీ ఇదే బ్యానర్లో హను ఓ కొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తే సరి.