Begin typing your search above and press return to search.
నాని హిట్ మెషీన్ అంటున్న రామ్
By: Tupaki Desk | 24 Sep 2016 9:38 AM GMT‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెట్టి.. ‘జెంటిల్ మన్’ వరకు వరుసగా నాలుగు హిట్లు కొట్టాడు నాని. ఇప్పుడు ‘మజ్ను’ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అతడి ఖాతాలో ఐదో హిట్టు జమచేసింది. అందుకే నానిని హిట్ మెషీన్ అంటున్నాడు యంగ్ హీరో రామ్. తన ‘హైపర్’ సినిమా ఆడియో వేడుకకు అతిథిగా వచ్చిన నాని గురించి మాట్లాడుతూ.. అతణ్ని హిట్ మెషీన్ అనాలేమో అని చమత్కరించాడు. దీంతో నాని సిగ్గుపడిపోయాడు. వేదిక మీద ఉన్నోళ్లంతా ఈ మాటకు చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు చరిచారు.
ఇక తన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ గురించి రామ్ చెబుతూ.. అందరూ తాను హైపర్ అనుకుంటున్నారని.. కానీ తనకంటే తన డైరెక్టరే పెద్ద హైపర్ అని రామ్ వ్యాఖ్యానించాడు. అందుకే ఈ సినిమా 3 నెలల్లోనే పూర్తి చేయగలిగాడని రామ్ చెప్పాడు. ‘కందిరీగ’ చేసినపుడే సంతోష్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని తాను అంచనా వేశానన్నాడు. 14 రీల్స్ తనకు మరో హోం బేనర్ లాంటిదని అంటూ.. పెదనాన్న ఇక్కడే ఉన్నారు కదా అంటూ ఇటు అటూ చూస్తూ నవ్వాడు రామ్. ‘హైపర్’ సినిమాకు సత్యరాజ్.. మురళీశర్మ.. రావురమేష్.. ఈ ముగ్గురూ పిల్లర్స్ లాంటి వాళ్లని రామ్ వ్యాఖ్యానించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ బిరియానీల కోసమే హైదరాబాద్ వచ్చాడని.. తన సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని రామ్ చమత్కరించాడు. ‘హైపర్’ షూటింగ్ జరుగుతున్న టైంలోనే తమ కెమెరామన్ సమీర్ రెడ్డి తండ్రి చనిపోయారని.. ఐతే మరుసటి రోజే అతను షూటింగ్ వచ్చేశాడని.. అంత కమిట్మెంట్ ఉన్న మనిషని రామ్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/