Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ తో ప్రేమలో పడ్డ రామ్!!

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:57 AM GMT
స్టార్ కిడ్ తో ప్రేమలో పడ్డ రామ్!!
X
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం హైపర్ మూవీని శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాని సెప్టెంబర్ చివర్లో విడుదల చేయాలన్నది రామ్ ఆలోచన. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకోసం రామ్ చాలానే కష్టపడుతున్నాడు. ఇలాంటి సమయంలో రామ్ ముంబై వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తన మాజీ హీరోయిన్ జెనీలియా ఫ్యామిలీతో స్పెండ్ చేశాడట రామ్.

రెడీ సినిమా తర్వాత రామ్-జెన్నీల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఇప్పటికీ ఇది బాగానే కంటిన్యూ అవుతోంది. అందుకే ముంబైలో జెనీలియా ఇంట్లోనే స్టే చేశాడు రామ్. అక్కడ జెన్నీ.. ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ లతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రామ్.. 'బెస్ట్ ఫ్రెండ్ జెనీలియా.. తన స్వీట్ హజ్బెండ్ రితేష్ దేశ్ ముఖ్ లతో నేను. ఇప్పుడు నేను రియాన్ తో అఫీషియల్ గా ప్రేమలో పడిపోయా' అంటూ ట్వీట్ పెట్టాడు. జెనీలియా-రితేష్ ల కొడుకే రియాన్.

సినిమాల్లో మొదలైన ఫ్రెండ్ షిప్.. ఫ్యామిలీగా మారాక కూడా కంటిన్యూ చేయడమంటే.. వీళ్లిద్దరికీ హ్యాట్సాఫ్ చెప్పాలంటే. ఇప్పటికీ పాత స్నేహాన్ని కొనసాగిస్తున్న జెన్నీ-రామ్ లకు సపోర్ట్ చేస్తున్న రితేష్ ని ఇంకా ఎక్కువ పొగడాలి.