Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: రొటీన్ జిందగీయేనా??

By:  Tupaki Desk   |   5 Aug 2017 7:32 AM GMT
ఫస్ట్ లుక్: రొటీన్ జిందగీయేనా??
X
'ఉన్నది ఒకటే జిందగి' అంటూ తన కొత్త సినిమాతోవస్తున్నాడు డైనమిక్ హీరో రామ్. మనోడు ఈ మధ్యకాలంలో స్టయిల్ ఫ్యాక్టర్ పై ఫోకస్ చేసిన సినిమాలన్నీ దెబ్బ కొట్టేశాయి. శివమ్.. హైపర్ సినిమాల రిజల్టే అందుకు ఉదాహరణ. ఆ మధ్యలో నేను శైలజ అంటూ కంటెంట్ ఉన్న సినిమా చేయడంతో అది పెద్ద హిట్టే అయ్యింది. అందుకే ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల డైరక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంటి ఫస్ట్ లుక్ ఇవాళ రిలీజైంది.

సరదాగా బీచ్ లో ఒక టాప్ లెస్ జీపులో రామ్ అండ్ గ్యాంగ్ ఎంజాయ్ చేస్తూ వెళుతున్నారు. ఇదే ఆ పోస్టర్లో ఉంది. కాకపోతే ఉన్నది ఒకటే జిందగీ అంటూ రాసినా ఆ అక్షరాలను చూస్తుంటే.. మారుతి సినిమాలను తలపిస్తోంది. మరి ఈ ఒక్క ఫోటో చూసి సినిమా గురించి ఏమీ చెప్పలేం కాని.. ఎందుకోగాని ఈ ఫస్ట్ లుక్ మాత్రం రొటీన్ గానే ఉందనే చెప్పాలి. అయితే కిషోర్ తిరుమల సినిమాల్లో రొటీన్ కథలనే కొత్త సన్నివేశాలతో బాగా చెబుతాడు కాబట్టి.. ఖచ్చితంగా మనోడు చాలా ఇంప్రెసివ్ గానే ఏదో ఒకటి చేస్తాడని అనుకుందాం.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి.. 'ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు' అనే తొలి పాటను ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అది సంగతి.