Begin typing your search above and press return to search.
నందూ.. తప్పించుకు తిరుగుతున్నాడట!
By: Tupaki Desk | 21 Aug 2018 6:06 AM GMTఎదిగే క్రమంలో ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది. కారణం ఏమో కానీ.. వరుస వివాదాల్లోకి కూరుకుపోతున్నాడు చిన్న హీరో నందు. తాజాగా అతగాడు నటించిన ఐందవి హర్రర్ మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. రెసన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరైన హీరోగారు రాకపోవటం ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో చిత్ర నిర్మాత నోరు విప్పి.. హీరో నందుకు తనకు చుక్కలు చూపిస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చేతిలో పెద్ద చిత్రాలేమీ లేకున్నా.. నందులో ఇలాంటి అటిట్యూడ్ ఉందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
ఐందవి నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ.. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లు తీసిన సినిమా చెప్పారు. అతీంద్రియ శక్తులు.. హార్రర్ అంశాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందన్నారు. సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. ఐందవీ ఆడియో ఫంక్షన్ కు హీరో నందు రాకపోవటాన్ని ప్రస్తావించిన నిర్మాత.. కొత్త నిర్మాతతో ఒక హీరో అనుసరించే పద్దతి ఇది కాదన్నారు.
"తెలుగు సినిమా పరిశ్రమలో దురదృష్టకరమైన విషయం కనిపిస్తున్నది. మా సినిమాలో నటించిన హీరో నందు ఆడియో ఫంక్షన్‌కు రాకపోవడం చాలా దారుణం. కొత్త నిర్మాత, దర్శకుడికి అండగా ఉండాల్సిన ఆయన తీరు అభ్యంతరకరంగా ఉంది. నందు పెద్ద హీరో కాడు. హీరో స్థాయి ఏదైనా కానీ నిర్మాత ఎవరైనా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది.నందును నమ్మి ఎంతో కష్టపడి నిర్మాతలు సినిమాను తీస్తున్నారు. ఎంతో డబ్బు పెట్టి సినిమా తీయడం ఈ రోజుల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆడియో వేడుకకు రాకపోవడం చాలా బాధ్యతారాహిత్యం" అని మండిపడ్డారు.
గత నెలన్నరగా రోజులుగా నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్టు తనకు తెలిసినట్లుగా మరో నిర్మాత నిర్మాత రామకృష్ణగౌడ్ పేర్కొన్నాడు. పలుమార్లు వేడుకకు రావాలని అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిసిందని... ఊర్లో లేను, బిజీగా ఉన్నాను అని అంటూ ముఖం చాటేశాడట అని చెప్పారు.
ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలందరూ, రామానాయుడు లాంటి వాళ్లు చిన్న సినిమాలతోనే సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. "చిరంజీవి లాంటి వాళ్లే చిన్న చిత్రాలతో కెరీర్ ఆరంభించారు. నందు నీవు చేసేది కరెక్ట్ కాదు. ఇకనైనా సినిమా ప్రమోషన్‌కు రావాలి. ఇంకా నీ ప్రవర్తన మార్చుకోకపోతే క్షమించారు. నిర్మాతకు అండగా నిలువాల్సిన నీవు ఇలా చేయడం తప్పు.ఎక్కడో ముంబైలోనూ మరోచోట ఉండే హీరోయిన్లు ప్రమోషన్స్‌కు వస్తున్నారు. మీలాంటి వాళ్లు ఇలా చేయడం సరికాదు. ఇక నుంచైనా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. సినిమా హిట్ అయితే హీరోకే ముందు పేరు వస్తుంది. నిర్మాతకు లాభం వచ్చి మరో సినిమా చేయాలంటే మీలాంటి హీరోల సహకారం ఉండాలి.హీరో నందు గానీ, మరెవరైనా ప్రమోషన్స్ రాకపోతే చెప్పండి. మీకు తగిన న్యాయం చేస్తాం. ఎలాంటి సహకారం కావాలన్న మేమంత అండగా ఉంటాం. హీరో నందుతో మాట్లాడి మీకు న్యాయం చేస్తాం" అని నిర్మాత రామకృష్ణగౌడ్ అన్నారు.