Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: దేవీని కవర్ చేసిన చరణ్

By:  Tupaki Desk   |   7 Jan 2019 6:05 AM GMT
వీడియో సాంగ్: దేవీని కవర్ చేసిన చరణ్
X
'రంగస్థలం' లాంటి సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చిన తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ 'వినయ విధేయ రామ' కు సంగీతం అందిస్తున్నాడు అనగానే ఈ సారికూడా చరణ్ కు చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ భారీ అంచనాల ప్రభావమో లేదా.. ఊర మాస్ సినిమాకు ఇంతకంటే ఏం చేస్తామని దేవీ అనుకున్నాడో తెలియదు గానీ 'వినయ విధేయ రామ' పాటల కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంరు రొటీన్ అని తీసిపారేస్తే మరొకొందరు మాత్రం యావరేజ్ అంటున్నారు. చార్ట్ బస్టర్ ట్యూన్ ఆల్బమ్ మొత్తంలో ఒక్కటి కూడా లేదని అందరూ యునానిమాస్ గా అంటున్నారు.

మరి ఇలాంటి పరిస్థితిలో దీన్ని కవర్ చేయాల్సిన బాధ్యత ఇద్దరిమీద ఉంది. ఒకరు బోయపాటి అయితే మరొకరు చరణ్. విజువలైజేషన్ కనుక పవర్ఫుల్ గా ఉంటే సాధారణమైన ట్యూన్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక దానికి చరణ్ లాంటి బ్రిలియన్ డాన్సింగ్ స్టార్ తోడైతే ఆ పాట ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన 'తందానే తందానే'.. 'ఏక్ బార్' సాంగ్స్ లో విజువల్స్ అందరినీ మెప్పించాయి. తాజాగా ఈ సినిమానుండి 'రామ లవ్స్ సీత' అంటూ సాగే పాట ప్రోమో వీడియో ను విడుదల చేశారు.

ట్యూన్ రొటీనే గానీ కలర్ ఫుల్ పంజాబీ భాంగ్రా స్టైల్ సాంగ్ కావడంతో వందలకొద్దీ డ్యాన్సర్లు కలర్ఫుల్ డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తుంటే చరణ్ - కియారా జోడీ ఉత్సాహంగా వారిని లీడ్ చేశారు. కోరియోగ్రఫీ కూడా సూపర్ గా ఉండడంతో చరణ్ డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఒవరాల్ గా ఒక సాధారణ్ ట్యూన్ ను చరణ్ ఫుల్ గా కవరప్ చేశాడు. టీమ్ వర్క్ కనుక ఉంటే అవుట్ పుట్ లో రిఫ్లెక్ట్ట్ అవుతుంది అంటారు.. ఆ టీం వర్క్ కు ఈ సాంగ్ బెస్ట్ ఎగ్జాంపుల్.