Begin typing your search above and press return to search.

రాజమౌళి సినిమాల్లో.. ఆయన భార్యకు నచ్చని సినిమా

By:  Tupaki Desk   |   19 Jan 2023 3:30 PM GMT
రాజమౌళి సినిమాల్లో.. ఆయన భార్యకు నచ్చని సినిమా
X
దర్శక దిగ్గజం రాజమౌళి జీవితంలో ఆమె సహదర్మచారిణి రమా రాజమౌళికి కూడా కచ్చితంగా ప్రత్యేమైన స్థానం ఉంటుంది. జక్కన్న తీసిన చాలా సినిమాలకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంటుంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ లో ఎలాంటి కాస్ట్యూమ్ కావాలి అనే విషయంలో రాజమౌళి, రమా చర్చించుకొని ఫైనల్ చేస్తారు.

నిజానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబానికి చెందిన వారే ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా జీవితంలో తన సక్సెస్ లో తన భార్య రమాకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందని రాజమౌళి ఇంటర్నేషనల్ అవార్డుల వేడుకలలో కూడా ప్రస్తావించాడు.

ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాల విషయంలో అంతగా ప్రభావితం చేస్తున్న అతని భార్య రమాకి జక్కన్న తెరకెక్కించిన ఒక సినిమా నచ్చలేదంట. తాజాగా ఆమె ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఅర్ హీరోగా వచ్చిన మూడో చిత్రం యమదొంగ. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రొటీన్ కథ అయినా కూడా రాజమౌళి తనదైన ట్రీట్మెంట్ తో స్ట్రాంగ్ గా కథనం నడిపించి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చేశారు. అయితే యమదొంగ సినిమా తనకి అస్సలు నచ్చలేదని రమా రాజమౌళి పేర్కొన్నారు.

అసలు తనకి ఎందుకు నచ్చలేదు అనేదానికి తన దగ్గర స్ట్రాంగ్ రీజన్ లేకపోయిన నేను మాత్రం ఆ మూవీకి పెద్దగా కనెక్ట్ కాలేకపోయానని రమా చెప్పడం విశేషం. అయితే ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఆ మూవీలో అద్బుతంగా ఉంటుందని, ఆ ఒక్క కారణంతోనే సినిమా హిట్ అయ్యిందని అనుకుంటున్న అని చెప్పుకొచ్చింది.

నిజానికి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలలో మొదటిగా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా యమదొంగ అని చెప్పాలి. అయితే లాంగ్ రన్ లో సినిమా అందరికి కనెక్ట్ అయ్యింది. అయితే రొటీన్ స్టొరీ లైన్, పాత సినిమాలలో సీన్స్ ని మళ్ళీ రిపీట్ చేసినట్లు ఉన్న సన్నివేశాలు యమదొంగలో ఉన్నాయనే అభిప్రాయాన్ని విమర్శకులు సైతం వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.