Begin typing your search above and press return to search.

రాజమౌళి భార్యకు బాహుబలి నచ్చలేదు

By:  Tupaki Desk   |   13 July 2015 4:29 PM GMT
రాజమౌళి భార్యకు బాహుబలి నచ్చలేదు
X
బాహుబలి సినిమాను దేశమంతా ఆహా ఓహో అంటూ పొగిడేస్తోంది. తెలుగు సినిమా గురించి ఎన్నడూ పట్టించుకోని కొన్ని ఇంటర్నేషనల్ పత్రికలు సైతం బాహుబలి సినిమా గురించి పాజిటివ్‌గా రాశాయి. వేరే ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సైతం బాహుబలి సినిమాను, రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. కానీ రాజమౌళి ఇంట్లో మాత్రం ఈ సినిమా గురించి పాజిటివ్ మాటలు వినిపించట్లేదు. ముఖ్యంగా రాజమౌళి సతీమణి రమకు ‘బాహుబలి’ నచ్చటేదట. ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా వెల్లడించాడు. తన భార్యకు బాహుబలి పూర్తి సంతృప్తి ఇవ్వలేదన్నాడు.

ఈ సినిమా అనే కాదని.. తన సినిమాలు వేటికీ కూడా తన ఫ్యామిలీ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాదని.. తనను, తన సినిమాలను పొగడ్డంలో తన ఫ్యామిలీ మెంబర్స్ పరమ పిసినారులని రాజమౌళి చెప్పాడు. ఐతే పెద్దవాళ్ల మా ఎలా ఉన్నా.. తన కొడుకు కార్తికేయకు, కీరవాణి తనయుడు భైరవలకు ‘బాహుబలి’ బాగా నచ్చిందని.. వాళ్లకైనా తన సినిమా నచ్చినందుకు సంతోషమని రాజమౌళి చెప్పాడు. మొత్తానికి రాజమౌళిని విమర్శించేవాళ్లు బయటే కాదు.. ఇంట్లో కూడా ఉండటం విశేషమే. వాళ్లను మెప్పించడానికైనా ఇంకా ఇంకా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాడు జక్కన్న.