Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' మీమ్ పై రాంజో స్పందన..!
By: Tupaki Desk | 4 March 2021 10:37 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''వకీల్ సాబ్'' ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం ఈ చిత్రం నుంచి 'సత్యమేవ జయతే' అనే రెండో సాంగ్ ని విడుదల చేశారు. థమన్ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని స్టార్ సింగర్ శంకర్ మహాదేవన్ - పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట రికార్డ్ స్థాయి వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
'జనగమున కలగలిసిన జనం మనిషి రా.. మనతరపున నిలబడగలిగే నిజం మనిషి రా.. వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే.. గుండెతో స్పందిస్తాడు.. అండగా చెయ్యందిస్తాడు' అంటూ సాగిన ఈ పాటలో ఒక్కో లిరిక్ పవన్ నిజ జీవితానికి దగ్గరగా ఉందని పీకే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఇది సినిమాలోని వకీల్ పాత్ర కోసం కాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినట్లు ఉందని కామెంట్స్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రిని ట్యాగ్ చేస్తూ దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ పెడుతున్నారు. ఓ ఫన్నీ మీమ్ రాంజో దృష్టికి కూడా వెళ్లడంతో తాజాగా ఆయన స్పందించారు.
'కింగ్' సినిమాలో బ్రహ్మానందం - సింగర్ కి మధ్య సంభాషణను తీసుకుని ఇక్కడ 'వకీల్ సాబ్' డైరెక్టర్ - రామజోగయ్య శాస్త్రి మధ్య జరిగినట్లు మీమ్ చేశారు. 'సాంగ్ ఎవరి గురించి రాయమన్నాను' అని డైరెక్టర్ అడుగగా.. 'వకీల్ గురించి' అని రామజోగయ్య చెప్పినట్లు.. 'మీరు ఎవరు గురించి రాశారు' అంటే 'పవన్ కళ్యాణ్ గురించి' అని సమాధానం చెప్పినట్లు ఆ మీమ్ ఉంది దీనిపై స్పందించిన రామజోగయ్య శాస్త్రి ''సినిమా విడుదలయ్యాక మాట్లాడుకుందాం.. సరేనా'' అంటూ ట్వీట్ చేశాడు.
కాగా, 'వకీల్ సాబ్' చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది 'పింక్' అనే హిందీ చిత్రానికి రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నాడు.