Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. బిగ్ బాస్ వద్దు ప్లీజ్!!
By: Tupaki Desk | 13 July 2017 3:52 PM GMTజూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం.. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా బుల్లితెరపై మెరవనున్న యంగ్ టైగర్ ను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ మహా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడీ కార్యక్రమం ఎన్టీఆర్ కి తగినది కాదంటున్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫర్ కామర్స్ ఛైర్మన్ పి. రామకృష్ణ గౌడ్.
ఎన్టీఆర్ ఈ కార్యక్రమం చేయకూడదని కోరుతున్నారాయన. ఇదో వివాదాస్పద కార్యక్రమం అంటున్న రామకృష్ణ గౌడ్.. అనేక మంది సెలబ్రిటీలను పార్టిసిపేట్ చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారని.. అయితే.. చాలామంది తిరస్కరించారనే విషయాన్ని గుర్తు చేశారు. బిగ్ బాస్ లాంటి కార్యక్రమం కారణంగా.. ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నది ఆయన వాదన. అంతే కాదు.. ఇది ఎన్టీఆర్ కెరీర్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఉన్న స్థాయికి వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు రామకృష్ణ గౌడ్.
'పెద్ద ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ లకు అభిమానిగా.. ఎన్టీఆర్ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకూడదని నేను కోరుకుంటున్నా' అని చెప్పారు. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం తమిళంలో ప్రసారం అవుతుండగా.. దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ పై తమిళనాడులో కేసు నమోదైంది. తమిళ సంస్కృతిని కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఈ కేసు దాఖలైంది. ఇప్పుడు తెలుగులో ఈ కార్యక్రమం మరెన్ని వివాదాలు సృష్టిస్తుందనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.