Begin typing your search above and press return to search.

రమణ గోగుల లైటింగ్ బిజినెస్

By:  Tupaki Desk   |   13 Nov 2015 11:30 AM GMT
రమణ గోగుల లైటింగ్ బిజినెస్
X
రమణ గోగుల.. ఈయన టాలీవుడ్ లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికీ తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు వరుసగా సంగీతం ఇచ్చి అప్పట్లో సెన్సేషన్ సృష్టించాడు గోగుల. తన హస్కీ వాయిస్ తో తనే పాటలు పాడి.. పవర్ స్టార్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందించాడు. ఈ మధ్య మ్యూజిక్ డైరెక్షన్ విషయంలో బాగా స్లో అయి ఫేడౌట్ అయిన గోగుల.. చివరగా సంగీతం ఇచ్చిన సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఈయనో బిజినెస్ మ్యాన్ అనీ.. స్టార్టప్ లలో పెట్టుబడులు చేస్తుంటారనీ చాలా తక్కువ మందికే తెలుసు.

రీసెంట్ గా ఆయన ఓ ట్వీట్ చేశాడు. సోలార్ హోమ్ లైట్స్ తయారు చేసే తన కంపెనీ ఎర్త్ గ్లోస్.. మణిపూర్ లోని ఓ మారుమూల గ్రామానికి లైట్స్ అందించబోతోందంటూ... ఆ లైట్ల ఫోటోలను పోస్ట్ చేశాడు గోగుల. ఈ ఎర్త్ గ్లోస్ కంపెనీకి ఈయన ఫౌండర్ కం సీఈఓ కావడం విశేషం. క్లీన్ ఎనర్జీ కాన్సెప్ట్ తో.. సాంప్రదాయ వనరుల నుంచి విద్యుత్ లైట్లను తయారు చేసే వ్యాపారం ఇది. మణిపూర్ తో పాటు, ఏపీలోనూ కొన్ని రిమోట్ గ్రామాల్లో ఈ కంపెనీ లైట్లను అమర్చారు. 2009నుంచి ఈ కంపెనీ నిర్వహిస్తున్నాడు గోగుల.

అలాగే.. యూనిటస్ సీడ్ ఫండ్ అనే సంస్థకు చెందిన ఆపరేటింగ్ టీంలో కూడా గోగుల సభ్యుడు. స్పీడ్2సీడ్ అనే కాన్సెప్ట్ తో స్టార్టప్ లకు నిధులు అందించే వెంచర్ ఇది. పలు కొత్త కంపెనీలకు, వ్యాపారాలకు సలహా సహాయ సూచనలు కూడా చేస్తూ ఉంటుంది యూనిటస్ సీడ్ ఫండ్. టెక్నాలజీ ఆధారంగా పుట్టుకొచ్చే కొత్త వ్యాపారాలకు నిధులు అందించి, తమ వంతు సహకారం ఇవ్వడం ద్వారా., భాగస్వాములు కావడం ఈ వెంచర్ ఉద్దేశ్యం. సంగీతంలోనే కొత్తదనాన్ని అందించిన రమణ గోగుల.. వ్యాపారాల్లోనే న్యూఏజ్ ఆలోచనలతో దూసుకుపోతున్నాడని చెప్పచ్చు.