Begin typing your search above and press return to search.
ఆయన లైవ్ గిటార్ వాయస్తుంటే...
By: Tupaki Desk | 13 Sep 2015 7:30 PM GMTబద్రి - తమ్ముడు - యువరాజు - మౌనమేలనోయి.. ఒకటేమిటి ఇలాంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన సంగీత దర్శకుడు రమణ గోగుల ఏమైపోయారు? ఇప్పుడేం చేస్తున్నారు? అసలు టాలీవుడ్ నుంచి ఎందుకు మాయమైనట్టు? .. ఇవన్నీ గోగుల అభిమానుల్ని వేధించే ప్రశ్నలు. అయితే వీటన్నిటికీ సమాధానం దొరికేసింది.
రమణ గోగుల నిన్నటి రేయి ఓ సింగింగ్ కాంటెస్ట్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన లైవ్ లో గిటార్ వాయిస్తుంటే శ్రోతలంతా ఉర్రూతలూగిపోయారు. ఓ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ప్రతిభను శంకించాలంటే చాలా కష్టం. అంతటి ట్యాలెంటు ఉండీ గోగుల టాలీవుడ్ నుంచి మస్సవ్వడం ఆయన అభిమానుల్ని ఎంతగానో వేధించింది. అదో చిక్కు వీడని ప్రశ్నలా మిగిలిపోయింది. అయితే గోగుల అప్పట్లో బోణీ అనే సినిమా నిర్మించి అప్పుల పాలయ్యాడని, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిక్కుల్లో పడ్డాడని వార్తలొచ్చాయి. కారణం ఏదైనా గోగుల అభిమానుల్ని వీడి వెళ్లి పోయాడు. తిరిగి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోనే ఉండిపోతున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి నిన్ననే సూపర్ సింగర్ కాంటెస్ట్ కోసం తిరిగి వచ్చారు. ఈ లైవ్ లో గోగుల అదరగొట్టేశారు.
అసలే టాలీవుడ్ లో సరైన సంగీత దర్శకులు లేక రొటీన్ మ్యూజిక్ రాజ్యమేలుతోంది. ఇలాంటప్పుడు గోగుల స్టయిల్ ఆప్ మ్యూజిక్ కిక్కిచ్చే ఛాన్సుంది. వెస్ర్టన్ బీట్ ని, మెలోడీస్ ని కొత్తగా వినిపించే ఛాన్స్ ఉంది. మలయాళం - తమిళ్ నుంచి రొటీన్ మ్యూజిక్ డైరెక్టర్ లను టాలీవుడ్ కి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. మరి ఈ మెగా మ్యూజిక్ డైరెక్టర్ తిరిగి టాలీవుడ్ వస్తారంటారా? ఇంతకీ ఆయన ఓ డార్క్ కామెడీకి డైరెక్ట్ చేస్తున్నారంటూ ప్రచారమైంది. అందులో నిజమెంత? గోగులనే వీటన్నిటిపైనా స్పందిస్తే బావుంటుంది.