Begin typing your search above and press return to search.
భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. 'కొమురం భీమ్' గా గర్జించిన ఎన్టీఆర్..!
By: Tupaki Desk | 22 Oct 2020 10:10 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' నుంచి 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో తారక్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు. నేడు విప్లవవీరుడు కొమరం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఈ పీరియాడిక్ మూవీలో కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ని పరిచయం చేశారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఈ టీజర్ అందరి అంచనాలను మించేలా ఉంది. చరణ్ వాయిస్ ఓవర్ తో ''వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి దైర్యం చీకట్లని చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్'' అంటూ ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసి చూపించారు.
ఈ ఇంట్రో వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం కనిపించిందని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే తారక రాముడు ఈ చిత్రంలో మరోసారి తన అద్భుతమైన నటనతో మంత్రముగ్దులను చేసాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ నీళ్లలో నుంచి బరిసె(ఈటె) తీసే షాట్.. ఎగసిపడే అలల ఎదుట ఎన్టీఆర్ నిలబడే దృశ్యం.. ఆకాశంలో మెరుపుల నడుమ చేతిలో గొలుసులు పట్టుకొని నిలబడిన షాట్.. జెండాని పాతే సీన్.. తారక్ కంటి నుంచి రక్తపు చుక్క నెల మీద పడే దృశ్యం.. అడవిలో మెరుపు వేగంతో పరిగెత్తడం.. కండలు తిరిగిన ఎన్టీఆర్ దేహం.. చివరిగా నెత్తికి టోపీ పెట్టుకొని నడుచుకు వచ్చే దృశ్యం.. ఇలా ఈ టీజర్ లో ఎన్టీఆర్ కనిపించిన ప్రతీ దృశ్యం అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ఉగ్రరూపానికి కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సెంథిల్ కుమార్ ఇచ్చిన విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. 'కొమురం భీమ్' గా యంగ్ టైగర్ గర్జన చూడాలంటే విడుదలయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే. మొత్తం మీద పాన్ ఇండియా లెవల్లో దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' తో ఎన్టీఆర్ 'పాన్ ఇండియా స్టార్' గా మారనున్నాడని అర్థం అవుతోంది.