Begin typing your search above and press return to search.
ఆర్‌ఆర్ఆర్ నుండి రామరాజు స్పెషల్ రానుంది
By: Tupaki Desk | 10 Aug 2021 11:30 AM GMTజక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్ లో చిత్ర యూనిట్ సభ్యులు ఈనెల చివరి వరకు సినిమా షూటింగ్ ను ముగించబోతున్నారు. సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు పాటలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు ఒలివియాల కాంబోలో కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా నుండి ఇటీవలే స్నేహితుల దినోత్సవం సందర్బంగా విడుదల అయిన దోస్తీ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం తదుపరి సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో ఉండే పాట వస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఈ సమయంలో జక్కన్న టీమ్ నుండి అనధికారికంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.
టీమ్ ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే సినిమా నుండి రెండవ పాటను విడుదల చేస్తారట. ఆ పాట ఇద్దరు హీరోలకు సంబంధించింది కాదని.. కేవలం రామరాజు పాత్ర పై ఉంటుందని తెలుస్తోంది. రామ్ చరణ్ మరియు ఆలియాల మద్య ఉండే పాటగా సమాచారం అందుతోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎన్టీఆర్ పై ఉండే పాటను విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదల సమయంలో ఇద్దరు హీరోలపై ఉండే భారీ సాంగ్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ నుండి వచ్చే ప్రతి అప్ డేట్ కూడా సినిమా స్థాయిని అమాంతం పెంచుతూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే వచ్చిన దోస్తీ సాంగ్ కు సినిమాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా అంచనాలను పీక్స్ కు తీసుకు వెళ్లింది. కనుక ఈ సాంగ్ కూడా మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ను జక్కన్న 1940 టైమ్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లూరి గా ఎన్టీఆర్ కొమురం భీమ్ లుగా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు కూడా రియల్ హీరోలు. అయితే చరిత్రలో ఎప్పుడు కలవని అల్లూరిని మరియు కొమురం భీమ్ ను కలిపి చూపించబోతున్న సినిమానే ఇది. ఇద్దరు కలిస్తే ఎలా ఉండేది అనే ఊహాజనిత కథను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా ను ఖచ్చితంగా దసరాకు విడుదల చేయాలనే హడావుడి కనిపిస్తుంది. ఒక వేళ థర్డ్ వేవ్ వల్ల ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం అయితే అప్పుడు వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కు సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.