Begin typing your search above and press return to search.
మహేష్ తిరస్కరించాక హృతిక్ ఓకే చెప్పారా?
By: Tupaki Desk | 24 July 2021 11:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ కాదనుకుంటే బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ ఆ వేషం కావాలనుకున్నారా? అల్లు `రామాయణం`లో హృతిక్ ని సంప్రదించే ముందే మహేష్ ని అరవింద్ సంప్రదించారా? .. ప్రస్తుతం ముంబై మీడియాలో హాట్ టాపిక్ ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు తిరస్కరించాకే హృతిక్ లైన్ లోకి వచ్చారట. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో సినిమా కోసం మహేష్ ఈ క్రేజీ ఆఫర్ ని కాదనుకున్నారని ప్రచారమవుతోంది.
అల్లు అరవింద్ - మధు మంతెన నిర్మించనున్న రామాయణం చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. 2022 మిడ్ లో రామాయణం షూటింగ్ ని ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో దీపిక పదుకొనే సీతాదేవి పాత్రలో నటించనున్నారు. నిజానికి `రామాయణం 3డి` ట్రయాలజీలోకి మహేష్ బాబు .. హృతిక్ రోషన్ .. దీపికా పదుకొనేలను ఎంపిక చేయాలని అరవింద్- మధు మంతెన బృందాలు సీరియస్ గా ప్రయత్నించారు. కానీ మహేష్ నో చెప్పారు! అన్న ప్రచారం సాగుతోంది.
రామాయణం 3డి.. అనేది దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించేంత విజువల్ బ్రిలియన్సీతో తెరకెక్కుతుందని కానీ.. రామాయణం కంటే రాజమౌళిని ఎన్నుకోవడంపై మహేష్ కు స్పష్టత ఉందని కథనాలొస్తున్నాయి.
ఆసక్తికరంగా .. రామాయణం 3డిలో హృతిక్ రావన్ పాత్రలో నటించేందుకు అంగీకరించగా దీపిక సీతగా కనిపిస్తుంది. మహేష్ బాబు శ్రీరాముడి పాత్రకు ఓకే చెబుతారనే ఇంకా నిర్మాతలు ఆశిస్తున్నారట.
మరోవైపు వేరొకరిని చూస్తే లార్డ్ రామ్ పాత్రకు సరిపోయేవాళ్లు ఎవరున్నారని దర్శకనిర్మాతలు వెతుకుతున్నారు.
రామాయణం 3డి చిత్రీకరణకు వెళ్ళే ముందే హృతిక్ పలు చిత్రాల్ని పూర్తి చేయాల్సి ఉంది. విక్రమ్ వేద రీమేక్ సహా నైట్ మేనేజర్ (అతని డిజిటల్ అరంగేట్రం).. ఫైటర్ చిత్రీకరణ పూర్తి చేస్తాడు. దీపిక కూడా పఠాన్ - ఇంటర్న్- ఫైటర్ వంటి చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.
ఇదిలావుండగా ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించే ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ లో మహేష్ నటిస్తారు. కె.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో చిత్రీకరణకు వెళుతుంది.
దీపావళి కి `రామాయణం` మొదలు?
ఎట్టకేలకు హిందీలో ఈ ఏడాది దీపావళి నుంచి రామాయణం 3డి మొదలుకానుందని ఇటీవల కథనాలొచ్చాయి. సౌత్ లో ఉన్న భారీ కాస్టింగ్ తోనే ఈ సినిమాను నిర్మించబోతున్నారని హృతిక్.. దీపిక ఇందులో చేరతారని వెల్లడైంది. త్వరలోనే ఇందులో స్టార్ కాస్ట్ ఎవరు అనే విషయం అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ సినిమా త్రేత యుగంలో మొదలై కలియుగంలో ముగిసే ఓ ట్రయాలజీ సిరీస్ తరహాలో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే మోడ్రన్ డేస్ కనెక్టివిటీ అంశాలను స్క్రిప్టులో ఏ విధంగా ప్రస్థావించారన్నది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కానుంది. ట్రయాలజీ కేటగిరీలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్- మధు మంతెన- నమిత్ మల్హోత్రా సంయుక్తంగా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారని ఇటీవల గుసగుసలు వినిపించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడిగా నటిస్తారా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఇక ఆంజనేయుడు.. లక్ష్మణుడు.. భరత శత్రుఘ్నుల పాత్రలకు వాలి సుగ్రీవుల పాత్రలకు కూడా ఎంపికలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ అవతార్ కి పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ల బృందం రామాయణం చిత్రానికి పని చేస్తారని.. హృతిక్ రావణ్ పాత్ర కోసం డిజైన్స్ రూపొందిస్తున్నారని కూడా కథనాలొచ్చాయి. ఏదేమైనా అల్లు కాంపౌండ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.