Begin typing your search above and press return to search.

రామ్‌, బోయపాటి మూవీ 2 ఇంట్రెస్టింగ్‌ విషయాలు

By:  Tupaki Desk   |   2 Aug 2022 5:33 AM GMT
రామ్‌, బోయపాటి మూవీ 2 ఇంట్రెస్టింగ్‌ విషయాలు
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా ను లాంఛనంగా ప్రారంభించారు. మొన్నటి వరకు ది వారియర్‌ పనుల్లో బిజీగా ఉన్న రామ్‌ ఎట్టకేలకు బోయపాటికి టైమ్‌ ఇచ్చాడట. దాంతో బోయపాటి చకచక షూటింగ్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇదే సమయంలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఆ విషయాలు సినిమాపై ఆసక్తి ని పెంచుతున్నాయి. బాలయ్యతో అఖండ సినిమాను తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బోయపాటి అంతకు మించి అన్నట్లుగా ఉండేలా రామ్‌ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా గురించి రెండు విషయాలు ప్రస్తుతం సినీ మరియు మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందులో మొదటిది ఈ సినిమా లో రామ్‌ ద్వి పాత్రాభినయం చేయబోతున్నాడు. రెండు పాత్రలు కూడా పూర్తి విభిన్నమైన వేరియేషన్స్‌ కలిగి ఉంటాయట. రామ్ రెండు పాత్రల కోసం రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించాల్సిన అవసరం ఉందట. అందుకోసం చాలానే కష్టపడాల్సి ఉంది.

అంతే కాకుండా ఈ సినిమా ఒక అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ అని.. రామ్‌ కి ఇలాంటి మాస్ యాక్షన్‌ స్క్రిప్ట్‌ లు బాగా నప్పుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బోయపాటి స్క్రిప్ట్‌ కోసం చాలా సమయం కేటాయించడం వల్ల పలు వర్షన్‌ లను రెడీ చేసి చివరకు ది బెస్ట్‌ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

హీరోగా రామ్ కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. ఇస్మార్ట్‌ శంకర్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో బోయపాటి సినిమా పై రామ్‌ ఆశలు పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

బోయపాటి మరో అఖండను రామ్‌ తో తీస్తాడా లేదంటే వినయ విధేయ రామ పునరావృతం చేస్తాడా అనే ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంది. రామ్ లుక్‌ మరియు ఇతర విషయాల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.