Begin typing your search above and press return to search.
'ఆచార్య' పాన్ ఇండియా గుట్టు విప్పేసిన చరణ్
By: Tupaki Desk | 24 April 2022 11:30 PM GMTఇప్పుడంతా పాన్ ఇండియా ఫీవర్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తెలుగు స్టార్ హీరో సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ తప్పనిసరి అన్నట్లు మారిపోయింది. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా పై మోజు పడుతున్నారు. అవకాశం రావాలే గానీ పాన్ ఇండియాలో ఎగిరిపోవాలని చూస్తున్నారు. ఇప్పుడు సినిమా వసూళ్లు పాన్ ఇండియా కేటగిరీలో కౌంట్ చేయాల్సి వస్తోంది. అంతగా పాన్ ఇండియా మేనియా తెలుగు నాట పాపులర్ అయిపోయింది.
ఇటీవలే `పుష్ప`.. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయి హిందీ బెల్ట్ ని ఏ రేంజ్లో షేక్ చేసాయో తెలిసిందే. మరి అంతటి స్టార్ డమ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య` ఎందుకు పాన్ ఇండియా లో రిలీజ్ కాలేదు? ఇదే ప్రశ్న రామ్ చరణ్ ముందుకు వెళ్లింది. వాస్తవానికి సినిమా ప్రకారంభం దగ్గర నుంచి అభిమానుల బుర్రల్ని ఈ ప్రశ్న తొలిచేస్తుంది. కానీ మౌనం మాటున వీడలేకపోయారు.
ఎలాగూ ఈనెల 29న `ఆచార్య` రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో అభిమానులు..మీడియా ఆ మౌనాన్ని వీడినట్లు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు సరైన సమాధానం దొరకేసింది. శివగారు ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు సౌత్ కంటెంట్ బేస్ట్ సినిమా మాత్రమేనని చెప్పారు. ఆ విధంగానే మన ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేసారు. పాన్ ఇండియా లో రిలీజ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు` అని చరణ్ వివరణ ఇచ్చారు.
అలాగే శివ-కొరటాల కాంబినేషన్ మెటీరియలైజ్ కాకపోవడానికి ఇప్పటికే కారణాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా తమమైత్రీ ఏమాత్రం దెబ్బతిన లేదని..ఇంకా ఇద్దరూ బాగా దగ్గరైనట్లు తెలిపారు. `ఆచార్య` సినిమాకి నిర్మాతగా వచ్చాను . కానీ అనుకోకుండా అందులో నటుడిగా భాగమయ్యాను. నటిస్తానని అస్సలు అనుకోలేదు. శివ గారు పాత్ర చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను అని అన్నారు.
ఇక చిరంజీవి తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియాలో రిలీజ్ అవకాశమైతే లేదు. అందులో రెండు చిత్రాలు మలయాళం రీమేక్. బాబి చేస్తోన్న మరో సినిమా పూర్తి కమర్శియల్ చిత్రమని తెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో మెగాస్టార్ ని పాన్ ఇండియా హీరోగా చూడలేము.