Begin typing your search above and press return to search.

డ్రీం ప్రాజెక్ట్ అదే అంటున్న చెర్రీ... ?

By:  Tupaki Desk   |   17 Nov 2021 12:30 AM GMT
డ్రీం ప్రాజెక్ట్ అదే అంటున్న చెర్రీ... ?
X
ఏ న‌టుడికి అయినా మంచి అవకాశాలు రావాలి. కోరుకున్న పాత్రలు చేయాలి. ఈ ఆశ బాగా ఉంటుంది. అలా కనుక ఆలోచిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా డ్రీమ్ క్యారక్టర్స్ బోలెడు ఉన్నాయిట. ట్రిపుల్ ఆర్ తరువాత చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్న సంగతి విధితమే. ఇది ఆయన కెరీర్ లో 15వ చిత్రం. ఈ మూవీ ఇలా ఉండగానే ఇంకో హాట్ ఫేవరేట్ సిన్మాను చెర్రీ లైన్ లో పెట్టేశాడు. జెర్సీ మూవీతో గౌతమ్ తిన్ననూరి బంపర్ విక్టరీ కొట్టాడు. తనలోని స్టామినాను కూడా సినీ లోకానికి తెలియచేశాడు. ఈ మూవీ హిందీ రీమేక్ చేస్తున్న గౌతమ్ తరువాత ప్రాజెక్ట్ ని మాత్రం చెర్రీతో చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో మూవీ 2022లోనే సెట్స్ మీదకు వస్తుందని అంటున్నారు.

ఈ సినిమా అవకాశాన్ని గౌతమ్ తిన్ననూరికి చరణ్ ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయట. ఆయన సినిమా టేకింగ్ విధానం తో పాటు సీరియస్ నెస్ అన్నీ నచ్చే చరణ్ నీతో ఒక సినిమా అని ఓకే చెప్పేశాడు అంటున్నారు. ఇక ఈ మూవీకి ఇంకో విశేషం ఉంది. చరణ్ స్పోర్ట్స్ మాన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడుట. సరిగ్గా అలాంటి సబ్జెక్ట్ తో గౌతమ్ తిన్ననూరి చెర్రీతో మీట్ కావడతో మరో మాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

కంప్లీట్ గా ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది అంటున్నారు. ఈ మూవీ లో కొత్త చరణ్ కనిపిస్తాడు అని కూడా తెలుస్తోంది. ఒక విధంగా 2022 చెర్రీ కెరీర్ లో ది బెస్ట్ ఇయర్ అని అంటున్నారు. జనవరిలో ట్రిపుల్ ఆర్, ఫిబ్రవరిలో ఆచార్య మూవీస్ తో జనాల ముందుకు వచ్చే చెర్రీ శంకర్ మూవీని కూడా స్పీడ్ గా కంప్లీట్ చేసి అదే ఇయర్ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్ తో ఉన్నాడని అంటున్నారు. ఇక 2023లో చరణ్, గౌతమ్ తిన్ననూరి మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందిట. సో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూసే మరి.