Begin typing your search above and press return to search.
`సీతారామం`ని మెచ్చిన చిరు..`కార్తికేయ-2`ని ఎత్తేసిన చరణ్!
By: Tupaki Desk | 28 Aug 2022 11:13 AM GMTఇటీవల రిలీజ్ అయిన `సీతారామం`.. `కార్తికేయ-2` విజయాలతో టాలీవుడ్ కళకళలాడుతోంది. కంటెంట్ ఉన్న చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆరదిస్తారని ఈ రెండు సినిమాలు సహా `బింబిసార` చిత్రాలు రుజువు చేసాయి. జనాలు థియేటర్లకు రావడం లేదన్న భయాందోళల్ని ఈ మూడు చిత్రాలు తొలగించాయి. `సీతారామం` క్లాసిక్ హిట్ గా నిలిస్తే..`కార్తికేయ-2` మిస్టికల్ హిట్ చిత్రాలుగా స్టిల్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.
తాజాగా `సీతారామం` చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రశంశిస్తూ ఓ లేఖ రాసారు.`` సీతారామం చూసాను. చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి కల్గింది. ముఖ్యంగా ఎంతో భిన్నమైన స్ర్కీన్ ప్లే తో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వీనీదత్ గారికి...స్వప్నదత్..ప్రియాంక దత్ లకు..ఫ్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి శుభాకాంక్షలు.
కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్ర శేఖర్ కి..అన్నిటి కన్నా ముఖ్యంగా సీత..రామ్ పాత్రలకు ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్..దుల్కార్ సల్మాన్ కి ..సూత్రధారి పాత్ర పోషించిన రష్మిక మందన్నకి ..టీమ్ అందరికీ శుభాకాంఓలు. ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిత్రానికి మరెన్నో అవార్డులు..రివార్డులు జాతీయ స్థాయిలో గెలవాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తున్నాను`` అని అన్నారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `కార్తికేయ-2`ని మెచ్చారు. మంచి సినిమాలకి ఎప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారన్నారు. టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రముఖులు సైతం మెచ్చారు. కృష్ణతత్వంపై ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా రావడం ఇదే తొలిసారి కావడం సహా ఎన్నో ప్రత్యేకతలు సినిమాలో ఉన్నాయి.
అవన్నీ సినిమాని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. ఇస్కాన్ సైతం ఇటీవలే చిత్రాన్ని మెచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి ప్రశంసా పత్రాన్ని సైతం ఇస్కాన్ రిలీజ్ చేయడం విశేషం. తాజాగా మెగా అభినందనలు సినిమాకు మరింత హైప్ ని తీసుకొస్తున్నాయి.