Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నాలో సగం: చరణ్

By:  Tupaki Desk   |   29 Dec 2021 5:06 PM GMT
ఎన్టీఆర్ నాలో సగం: చరణ్
X
ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్లో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబై .. చెన్నైలలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించిన ఈ సినిమా టీమ్, త్రివేండ్రంలోను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపింది. ఈ వేదికపై చరణ్ మాట్లాడుతూ .. "హలో కేరళ .. థ్యాంక్యూ సోమచ్ త్రివేండ్రం. ఇంతకుముందు నేను చేసిన 'మగధీర' ఇక్కడ సూపర్ సక్సెస్ అయింది. మీరంతా మీ అభిమానంతో మమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేశారు. మీ నుంచి మాకు ఎన్నో ఆశీస్సులు లభించాయి.

నేను ఇంతకుముందు కేరళలో ఏ సినిమా ఫంక్షన్ చేయలేదు. రాజమౌళి గారు నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. వాళ్లు నీకు అంతటి హిట్ ఇచ్చారంటే నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడాలని. ఇప్పుడు ఇలా 'ఆర్ ఆర్ ఆర్' తో మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి భారీ సినిమాను మాతో నిర్మించిన దానయ్య గారికి .. ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్న శిబూగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ రోజున నేను .. నా బ్రదర్ ఎన్టీఆర్ ఇక్కడ ఉండటానికి కారణం రాజమౌళి గారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

'ఆర్ ఆర్ ఆర్ ' అంటే ఏంటని అంతా అడుగుతున్నారు .. 'ఆర్ ఆర్ ఆర్' అంటే నా డ్రీమ్ అనే నేను చెబుతాను. తోవినో సార్ పేరు చెబితేనే ఇక్కడి వాళ్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నేను గమనిస్తున్నాను. ఆయనకీ ఇక్కడ ఎంత క్రేజ్ ఉందనేది నాకు అర్థమైంది. ఈ ఫంక్షన్ కి వచ్చిన తోవినో సార్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. సూపర్ హీరోగా ఆయన నిరూపించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక ద్వారా 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను. చివరిగా నా బ్రదర్ ఎన్టీఆర్ గురించి చెబుతాను .. ఆయన నాలో ఒక భాగం.

ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. ఆయన లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చి ఉండేది కాదేమో. ఆయనకి సంబంధించి నాకు మంచి మెమొరీస్ ఉన్నాయి. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటూ ఉంటారు. ఎందుకనేది నాకు తెలుస్తోంది .. మీ సిటీ .. మీ స్టేట్ ఎంతో బ్యూటిబుల్ గా ఉన్నాయి. మీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చిన ప్రతిసారి ఎంతో ప్ర్రేమ చూపిస్తారు. ఫైనల్ గా మీ సినిమాల గురించి చెప్పాలంటే, దేశంలోనే ఫైనెస్ట్ సినిమాలు. మంచి డైరెక్టర్స్ ఉన్నారు .. మంచి యాక్టర్స్ ఉన్నారు. మీ మూవీ కంటెంట్స్ ను చూసి మేము ఇన్ స్పైర్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ మరోసారి థ్యాంక్స్. మీతో ఈ అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించాడు.