Begin typing your search above and press return to search.

పాన్ వ‌ర‌ల్డ్ కొట్టేయాలి.. అదీ మ‌గ‌ధీరుని క‌సి!?

By:  Tupaki Desk   |   18 Jan 2023 11:30 AM GMT
పాన్ వ‌ర‌ల్డ్ కొట్టేయాలి.. అదీ మ‌గ‌ధీరుని క‌సి!?
X
జ‌గ‌మంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది! అంటూ సిరివెన్నెల ఏ ముహూర్తాన క‌లం ఝ‌లిపించారో కానీ.. ఆ లిరిక్ లో ఉన్న మీనింగేమిటో ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కి తెలిసొస్తోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌కే అంకిత‌మైపోతే పొర‌పాటు గ్ర‌హ‌పాటు అని గ్ర‌హించేశారు. ఇక‌పై ఓన్లీ గ్లోబ‌ల్ మార్కెట్ ని మాత్ర‌మే చూస్తున్నారు. మ‌న స్టార్లు..ఫిలింమేక‌ర్స్.. పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ కి ప్ర‌మోట్ అవ్వ‌డం ఎలా అన్న‌దే ముందున్న ఏకైక ల‌క్ష్యం.

స్టార్ హీరో కం అగ్ర నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ విష‌యంలో మ‌రింత అడ్వాన్స్ డ్ గా ఆలోచిస్తున్నారు. జ‌గ‌మంత కుటుంబం నాదీ.. అని ప్రభాస్ బాహుబ‌లి- సాహో చిత్రాల‌తో పాన్ ఇండియాలో తొలి అడుగులు వేసి విజ‌యం సాధించాక అదే బాట‌లో చ‌ర‌ణ్ కూడా అడుగులు వేస్తున్నాడు. ప్ర‌భాస్ కంటే ఒక మెట్టు ముందు ఉండాల‌ని త‌పిస్తున్నాడు. ఒక గ్లోబల్ సినిమా కోసం 'కలపడం' మొద‌లెట్టాడ‌నేది తాజా అప్ డేట్. ఓవైపు ప్ర‌భాస్ స‌హా టాలీవుడ్ స్టార్లంతా పాన్ ఇండియా పాన్ వ‌ర‌ల్డ్ పై గురి పెట్ట‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌గా మారింది. ఆర్.ఆర్.ఆర్ గోల్డెన్ గ్లోబ్ అందుకోవ‌డంతో ఇది మ‌రింత ఊపందుకుంది.

గోల్డెన్ గ్లోబ్స్ - క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుక‌ల్లో RRR సంచ‌ల‌న‌ విజయాల గురించి ముచ్చ‌టించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర పరిశ్రమలు ఏకీకృతం దిశ‌గా అడుగులు వేసే స‌మయం ఆస‌న్న‌మైంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు. అమెరికాలో ప్ర‌ముఖ‌ మీడియాతో మాట్లాడుతూ-''లాస్ ఏంజెల్స్ (LA)కి రావడం మా లక్ష్యంలో భాగం కాదు. కానీ మేం ఇక్కడకొచ్చాం. కాబట్టి మేము వెళ్ళేటప్పుడు (పుర‌స్కారం లేదా గౌర‌వం) తీసుకెళ‌తాం. వాస్తవానికి మేం LA కి రావాల‌నుకోగానే అక్క‌డ‌ హాలీవుడ్ లోని గొప్ప దర్శకులను క‌ల‌వాల‌నుకున్నాం.. వారితో మ‌మేక‌మ‌వ్వాల‌ని భావించాం. వారు కూడా మమ్మల్ని నటులుగా ఫీల‌వ్వాల‌ని (అనుభ‌వ‌పూర్వ‌కంగా తెలుసుకోవాల‌ని) .. తూర్పు - పశ్చిమ దేశాల మధ్య సాంస్కృతిక ఆలోచనలు కథలను ఇరువైపులా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు క్వెంటిన్ టరాన్టినో నా అభిమాన దర్శకుల్లో ఒకరు అని కూడా రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సినీప‌రిశ్ర‌మ‌లు.. తార‌ల క‌ల‌యిక గురించి ఇరువైపులా ప‌ర‌స్ప‌ర‌ సహకారం గురించిన ప్రశ్నలకు రామ్ చరణ్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చారు.

''అన్ని 'ఉడ్స్'ని కాల్చివేసి (అడ్డంకుల‌ను తొల‌గించి)... ఒకే గ్లోబల్ సినిమా వచ్చే రోజు కోసం మేం ఎదురుచూస్తున్నామ''ని కాస్త సీరియ‌స్ గానే మాట్లాడారు. టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ హాలీవుడ్ అని ఇన్ని ఉడ్స్ లేకుండా గ్లోబ‌ల్ ఉడ్ ఉండాల‌నేది అత‌డి అభిమ‌తం. కానీ ఈ సీరియ‌స్ నెస్ మునుముందు అవెంజ‌ర్స్ .. అవ‌తార్.. బ్లాక్ పాంథ‌ర్.. స్పైడ‌ర్ మేన్ సీక్వెల్స్ లా మారాల‌ని టాలీవుడ్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్ర‌భాస్- రామ్ చ‌ర‌ణ్‌- మ‌హేష్ (టాలీవుడ్ స్టార్స్) - టామ్ క్రూజ్- డికా ప్రియో- స్కార్లెట్ జాన్స‌న్- రోబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్- క్రిస్ ఇవాన్స్ (అవెంజ‌ర్స్ స్టార్స్)- సామ్ వ‌ర్తింగ్ట‌న్- జో స‌ల్దానా (అవ‌తార్ స్టార్స్) క‌ల‌యిక‌లో భారీ ఫ్రాంఛైజీ సినిమాలు రావాల‌ని ఆకాంక్షించ‌డంలో త‌ప్పేమీ లేదు. నేటి జ‌న‌రేష‌న్ లో హైఎండ్ టెక్నాల‌జీ వ‌ర‌ల్డ్ లో ఇది అత్యాశ కానేకాదు. లేదా మ‌న స్టార్లు ఏకాకి జీవితాన్ని ఇరుకు మెంటాలిటీని వ‌దిలేసి యూనివ‌ర్శ‌ల్ గా ఎద‌గడాన్ని చూసి ఇత‌ర ప‌రిశ్ర‌మల హీరోలు ఫిలింమేక‌ర్స్ అసూయ చెందాల‌ని కోరుకుందాం.

స‌మీక‌ర‌ణాలు మారతాయా చెర్రీ?

ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి 15 ని పాన్ వ‌ర‌ల్డ్ రేంజులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న రామ్ చ‌ర‌ణ్ త‌దుప‌రి కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ స‌హా ప‌లువురు టాప్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాల‌ను ఖ‌రారు చేస్తున్నారు. బ‌హుశా గోల్డెన్ గ్లోబ్స్ వేడుక‌ల్లో హాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ప‌రిచ‌యంతో స‌మీక‌ర‌ణాలు మార్చేస్తాడేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.