Begin typing your search above and press return to search.
మా నాన్న నాకు చెప్పిన మాట అదొక్కటే: చరణ్
By: Tupaki Desk | 13 Jan 2022 4:30 AM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. కథాకథనాలపై ఆయనకి మంచి పట్టు ఉంది. ఏ వర్గం ప్రేక్షకులు ఎలాంటి కథలను కోరుకుంటారు అనే విషయంపై ఆయనకి మంచి అవగాహన ఉంది. ప్రస్తుతం ఆయన శంకర్ తో నిర్మిస్తున్న సినిమా, ఆయన బ్యానర్ నుంచి రానున్న 50వ సినిమా. అంతటి అనుభవం ఉన్న దిల్ రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ 'రౌడీ బాయ్స్' సినిమాను నిర్మించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చరణ్ వచ్చాడు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా నుంచి నాలుగు సాంగ్స్ రిలీజ్ చేశారని విన్నాను. నా బ్రదర్ దేవీశ్రీ ప్రసాద్ ఇంక్కడ లేడుగానీ, ఆయన ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తోంది. అన్ని సాంగ్స్ హిట్ అనే టాక్ నేను విన్నాను. కెమెరామెన్ మదీ గారితో నేను పనిచేయాలనుకున్నాను. అది ఆశిష్ కి ఫస్టు ఫిల్మ్ తోనే జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసే ఇక్కడికి వచ్చాను. ఆశిష్ చాలా చాలా బాగా చేశాడు. ఆయన ఎనర్జీ నచ్చింది .. ఆయనలో ఉన్న స్పార్క్ నచ్చింది .. ఆయన ఈజ్ నచ్చింది .. డాన్స్ నచ్చింది.
దిల్ రాజు గారు ఎంతగా వెనక ఉన్నప్పటికీ ఆయనే కష్టపడాలి. నేను .. ప్రభాస్ .. మహేశ్ అలా కష్టపడే ఈ స్థాయికి వచ్చాము. అలాంటి లక్షణాలు అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. హార్డ్ వర్క్ చేయమని ఆయనకి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే తాము ఎంచుకున్న మార్గంలో ఎక్కువ కాలం ప్రయాణం చేయాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు .. డిసిప్లిన్ కూడా ఉండాలి. డిసిప్లిన్ ఉన్నవారికి టాలెంట్ తక్కువైనా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. మా నాన్నగారు నాకు చెప్పిందే అదే .. నేను ఎవరికైనా చెప్పేది అదే.
ఎలా యాక్ట్ చేశావ్ .. ఎలా డాన్స్ చేశావ్ అని ఆయన ఎప్పుడూ నన్ను అడగలేదు. ఉదయాన్నే 7 గంటలకల్లా షూటింగులో ఉన్నావా లేదా? అని మాత్రమే ఆయన అడుగుతారు. బోరింగ్ గా అనిపించినప్పటికీ సక్సెస్ ను సాధించిన వాళ్లంతా అదే పనిని 365 రోజులు చేస్తూ .. అదే పడవలో ప్రయాణం చేస్తూ వెళ్లారు. నేను కూడా ఒక వైపున యాక్ట్ చేస్తూ 'సైరా' లాంటి సినిమాకి ప్రొడక్షన్ పనులు చేశాను .. కానీ నా మనసు ఎప్పుడూ కూడా యాక్టింగ్ పైనే ఉండేది. నీ వెనకాల నిర్మాతలుగా లెజెండ్స్ ఉన్నారు. అందువలన నువ్వు మాత్రం హండ్రెడ్ పెర్సెంట్ యాక్టింగ్ పైనే దృష్టి పెట్టు.
ఇక అనుపమ విషయానికి వస్తే 'శతమానం భవతి' చుశాను. సోషల్ మీడియాలోను ఆమెను చూస్తుంటాను. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఒక బల్బ్ లా వెలుగుతూ ఉంటుంది. ఆమె స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కి చాలా తక్కువమంది నచ్చుతారు. అలాంటివారిలో అనుపమ ముందువరుసలో ఉంటారు. ఆమె ఆశిష్ పక్కన ఉండటం ఒక ఎస్సెట్ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. రేపటి రోజున దిల్ రాజ్ గారి సపోర్ట్ లేకుండా ఆశిష్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి మమ్మల్ని వదులుకున్నా దిల్ రాజు గారిని వదులుకోవడం లేదు. ఆయన ఎన్నో సక్సెస్ ఫుల్ సంక్రాంతులు చూశారు .. ఈ సంక్రాంతి కూడా ఆయనదే అవ్వాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.