Begin typing your search above and press return to search.

విశ్వ‌క్ ప‌ర్స‌నాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ ని - రామ్ చ‌ర‌ణ్‌

By:  Tupaki Desk   |   16 Oct 2022 11:43 AM GMT
విశ్వ‌క్ ప‌ర్స‌నాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ ని - రామ్ చ‌ర‌ణ్‌
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తున్న మూవీ `ఓరి దేవుడా!`. మిథిలా పాల్క‌ర్‌, ఆశ భ‌ట్ హీరోయిన్ లుగా న‌టించారు. విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో దేవుడిగా న‌టించిన ఈ మూవీని అశ్వ‌త్ మారి ముత్తు డైరెక్ట‌ర్ చేశారు. త‌మిళ హిట్ ఫిల్మ్ `ఓ మై క‌డ‌వులే` ఆధారంగా రీమేక్ చేశారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రాజ‌మండ్రిలో ఆది వారం నిర్వ‌హించారు.

విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ `రామ్ చ‌ర‌ణ్ అన్న జ‌ర్నీ నాకు ఎంతో స్ఫూర్తి దాయ‌కం. మెగాస్టార్ వంటి స్టార్ కొడుకుగా భారీ భాధ్య‌త‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి ప‌రిచ‌య‌మైన మీరు దాన్ని ఓవ‌ర్ క‌మ్ చేసి ఇండియ‌న్ సినిమాని రిప్ర‌జెంట్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. మీ గురించి ప్ర‌తీ ఒక్క‌రూ ఇప్ప‌డు మాట్లాడుతున్నారు. మీ డిసిప్లిన్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుతున్నారు. నేను దాని గురించి నేనూ విన్నాను. అప్ప‌టి నుంచి మీలా డిసిప్లిన్ గా వుండాల‌నుకుంటున్నాను. మీరు ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. ఎందుకంటే నా తొలి సినిమా `ఫ‌ల‌క్ నుమాదాస్‌` కోసం నాని అన్నా వ‌చ్చాడు. ట్రైల‌ర్ లాంచ్ కి వెంక‌టేష్ గారొచ్చారు. ఆయ‌న‌ని అడిగిన వెంట‌నే ఈ మూవీలో దేవుడి పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించారు.

ఇప్ప‌డు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చ‌ర‌ణ్ అన్న వ‌చ్చారు. స‌ర్సెస్ రోజు చాలా మాట్లాడుతా. అశ్వ‌త్ మారిముత్తు బ్రిలియంట్ స్టోరీ ని అందించాడు. ఇండియాలో వ‌న్ ఆఫ్ ద బ్రిలియంట్ డైరెక్ట‌ర్ ల‌లో ఒక‌రు అవుతాడు. నేను డౌట్ లో వున్న స‌మ‌యంలో పీవీపీ వారు నా డౌట్ ల‌ని క్లియ‌ర్ చేశారు. అన్ని వ‌ర్గాల వారి హృద‌యాన్ని తాకే సినిమా ఇది. థియేట్రిక‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ ని మిస్స‌వ‌కండీ.. దివాళీ మూడు రోజుల ముందే వ‌స్తోంది` అని తెలిపాడు.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ `నేను కానీ, నాన్న‌గారు కానీ సినిమాని ఎంత ప్రేమిస్తామో తెలుసు. ఒక మంచి సినిమాని ఎంత‌గా ఆద‌రిస్తామో తెలుసు. ఇంత మంది ప్రేక్ష‌కులు రావ‌డం వ‌ల్ల మంచి సినిమాని ఆద‌రించే మంచి గుణం వుంద‌ని నిరూపించారు. అదీ మా ఫ్యాన్స్ అంటే మిమ్మ‌ల్ని చూస్తే గ‌ర్వంగా వుంది. వంశీ కాక పీఆర్వోగా బాగా చేశాడు. తొలి సారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా చేస్తున్నాడు. పీవీపీ ప్రొడ‌క్ష‌న్స్ వారు మంచి క్వాలిటీ వున్న సినిమాలు తీస్తుంటారు. అశ్వ‌త్ చేసిన సినిమా నేను కూడ‌లేదు. ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నా. ఈ మూవీలో బాస్ ఆఫ్ కామెడీ గా పేరున్న వెంక‌టేష్ గారిని కీల‌క అతిథి పాత్ర కోసం తీసుకున్నారు. వెంక‌టేష్ అన్నా నేను నీకోస‌మైనా ఈ సినిమా చూస్తా. ఇక మిథిలా పాల్క‌ర్ ఓటీటీ సూప‌ర్ స్టార్. విశ్వ‌క్ సేన్‌.. ఆంధ్ర ప్ర‌దేశ్.. తెలంగాణ గ‌ల్లీ గ‌ల్లీలో..ఈ పురు తెలియ‌ని వాళ్లు లేరు. అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ హిట్స్ తో అంద‌రి గుండెల్లో..ఫాల‌క్ నుమా నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు వైజాగ్ నుంచి చిత్తూరు వ‌ర‌కు గ‌ల్లీ గ‌ల్లీలో త‌న‌కు ఫ్యాన్స్ వున్నారు. ఇత‌నిక యూత్ లో భారీ ఫ్యాన్స్ వున్నారు. అయితే విశ్వ‌క్ ప‌ర్స‌నాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ ని.

సినిమాలో హీరో క‌న్నా బ‌య‌ట విశ్వ‌క్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. ఇచ్చిన మాట‌, చెప్పిన మాట‌పై నిల‌బ‌డే వారంటే నాకు చాలా ఇష్టం. అలా నిల‌బ‌డ‌తాన‌ని నాకు మంచి పేరుంది. మంచో చెడో విశ్వ‌క్ సేన్ నిల‌బ‌డ‌తాడనే టాక్ అంద‌రిలో వుంది. అది నేను కూడా గ‌మ‌నించాను. క‌ష్టాల్లో వున్న‌ప్పుడు ఫ్రెండ్స్ అంతా విశ్వ‌క్ సేన్ ద‌గ్గ‌రికి వెళ‌దాం అని అనుకోవ‌డ‌మే విశ్వ‌క్ సాధించిన బిగ్గెస్ట్ అచీవ్ మెంట్‌. ఇలాగే నువ్వు కంటిన్యూ చెయ్‌.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు కానీ వీళ్లంతా సినిమాలు ఆడొచ్చు ఆడ‌క‌పోవ‌చ్చు.. ఎల్ల‌కాలం అంద‌రి దృష్టిలో సూప‌ర్ స్టార్ లుగా వుండాలంటే వ్య‌క్తిగ‌తంగా ఇచ్చి మాట కోసం నిల‌బ‌డ్డారు. అలా నిల‌బ‌డ్దారు కాబ‌ట్టే సూప‌ర్‌స్టార్ లు గా నిలిచారు. అది విశ్వ‌క్ సేన్ లో నిండుగా వుంది. 21న విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ని థియేట‌ర్స్ లో చూడండి. సినిమా దివాళీ ఫెస్టివెల్ కి వ‌న్నె తెస్తుందా? అన్న‌ది తెలియ‌దు కానీ మీ అంద‌రి ఆశీస్సులు వీరికుండాలి. ఈ సినిమాని త‌ప్ప‌కుండా నేను చూస్తాను. మంచి కామెడీ.. ఫీల్ వున్న సినిమా.. ఇంత‌క‌న్నాఈ ఫెస్టివెల్ కు ఏం కావాలి` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మిథిలా పాల్క‌ర్‌, ఆశ భ‌ట్, అశ్వ‌త్ మారిముత్తు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వంశీ కాక‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.