Begin typing your search above and press return to search.

మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన RRR స్టార్

By:  Tupaki Desk   |   30 March 2022 4:30 PM GMT
మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన RRR స్టార్
X
కొడ్తే కుంభాన్నే కొట్టాలి. ఇంత‌కుముందులో నేను ప్రాంతీయ హీరోని అని చెప్పుకునేందుకు టాలీవుడ్ హీరోలు సిద్ధంగా లేరు. ఇప్పుడు పాన్ ఇండియా ఫీవ‌ర్ ముందు ఏదీ నిల‌వ‌డం లేదు. ప్ర‌తి ఒక్క హీరో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న అర‌డ‌జ‌ను టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కొల్ల‌గొట్ట‌డంపైనే దృష్టి పెట్టారు.

ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత శంక‌ర్ తో ఆర్.సి15 మూవీ ప్లాన్ చేసిన‌ రామ్ చరణ్ ప్లానింగ్ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఉంది. RRR అద్భుత విజయం చరణ్ కు అన్నివిధాలా పెద్ద సాయ‌మ‌వుతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా తన అద్భుతమైన నటనతో అద‌ర‌గొట్టేసిన‌ రామ్ చరణ్ బాలీవుడ్ దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు.

తాజా గుస‌గుస ప్ర‌కారం.. రామ్ చరణ్ బాలీవుడ్ లో సినిమా చేయ‌నున్నాడు. ప్రముఖ హిందీ ప్రొడక్షన్ హౌస్ తన త‌దుప‌రి భారీ చిత్రం కోసం రామ్ చరణ్ ను ఎంపిక చేసుకుందిట‌. రామ్ చరణ్ తన ప్రస్తుత కమిట్ మెంట్ ల తర్వాత త్వరలో బాలీవుడ్ చిత్రంలో ఖచ్చితంగా కనిపిస్తాడు. తాజా గుస‌గుస నిజ‌మ‌వుతుంద‌నే ఆశిద్దాం. క‌ర‌ణ్ జోహార్ - రోహిత్ శెట్టి- ప్ర‌భుదేవా- ఓంరౌత్ వంటి ద‌ర్శ‌కులు చ‌ర‌ణ్ తో సినిమా చేస్తారేమో చూడాలి.