Begin typing your search above and press return to search.
చిరు కెరీర్ చరణ్.. చరణ్ కెరీర్ చిరు చక్కబెడుతున్నారా?
By: Tupaki Desk | 8 Oct 2022 6:26 AM GMTమెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని చరణ్, చరణ్ కెరీర్ ని చిరు చక్క బెడుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలని బట్టి నిజమేనని స్పష్టమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి తో 'RRR' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న తరువాత చరణ్ సమీకరణాలు, ప్రాధామ్యాలు మొత్తం మారినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఫాదర్ మెగాస్టార్ విషయంలోనూ చరణ్ కొత్త ఎత్తులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.
'ఆచార్య'తో భారీ డిజాస్టర్ ని దక్కించుకున్న మెగాస్టార్ ని ఎలాగైనా తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలని, ఇందు కోసం తండ్రి చిరుకు తగ్గ బ్లాక్ బస్టర్ రీమేక్ లని వన్ బై వన్ లైన్ చరణ్ లైన్ లో పెట్టడం గమనార్హం. తన కెరీర్ పట్ల చరణ్ ఎంత కేర్ గా వున్నాడో స్పష్టం చేస్తూ రీసెంట్ గా చిరు వెల్లడించిన విషయాలే ఇందుకు అద్దంపడుతున్నాయి. 'లూసీఫర్' రీమేక్ హక్కుల్ని తీసుకుంటున్నానని చరణ్ చెప్పగానే తాను అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెర్షన్ చూశానని, అయితే దాన్ని ఎలా రీమేక్ చేస్తే బాగుంటుందో చరణ్ కు అప్పడే చెప్పానని చిరు తెలిపారు.
ఇద్దరు అనుకున్నట్టుగానే 'లూసీఫర్'ని తెలుగులో 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేసి ఫైనల్ గా సక్సెస్ సాధించారు. ఇదే ఊపులో చరణ్ తండ్రి మెగాస్టార్ కోసం మరో మలయాళ హిట్ మూవీ రీమేక్ హక్కుల్ని దక్కించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా ప్రస్తుతం హిట్ ని తన ఖాతాలో వేసుకున్న చిరు కోసం చరణ్ మరో మలయాళ హిట్ ఫిల్మ్ రీమేక్ హక్కుల్ని తీసుకోవడం విశేషం.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీష్మ పర్వం'. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈమూవీని అమల్ నీరద్ తెరకెక్కించాడు. ఈ ఏడాది మార్చి 3న విడుదలై అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ చిరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సంచలనం సృష్టించడం ఖాయం అని భావించిన చరణ్ ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకోవడం విశేషంగా చెబుతున్నారు.
చరణ్ తండ్రి చిరు కెరీర్ గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే తన కెరీర్ గురించి కూడా ఆచితూచి అడుగులే వేస్తున్నారు. ఇందుకు తండ్రి చిరు కూడా సహకరిస్తున్నారట. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో RC15 లో నటిస్తున్న చరణ్ తన తదుపరి సినిమాని గౌతమ్ తిన్ననూరితో చేయాలి. కానీ ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ ప్లేస్ లో టాలెంట్ డైరెక్టర్ తో పాన్ ఇండియా స్థాయి కథతో సినిమా చేయాలని చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఎవరితో వుండబోతోంది? దర్శకుడు ఎవరు? అన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని, ఈ ప్రాజెక్ట్ ని యువీ క్రియేషన్స్ నిర్మించనుందని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.