Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ క‌న్న‌డ డైరెక్ట‌ర్ ని కూడా లైన్ లో పెట్టాడా?

By:  Tupaki Desk   |   14 Dec 2022 3:30 PM GMT
చ‌ర‌ణ్ క‌న్న‌డ డైరెక్ట‌ర్ ని కూడా లైన్ లో పెట్టాడా?
X

జ‌క్క‌న్న `RRR` తో రామ్ చ‌ర‌ణ్ వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపుని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ అందించిన క్రేజ్ ని దృష్టిలోపెట్టుక‌ని హీరో రామ్ చ‌ర‌ణ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్‌ని ప్లాన్ చేసుకుంటూ కెరీర్ విష‌యంలో ప‌క్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. `RRR` త‌రువాత రామ్ చ‌ర‌ణ్ ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో త‌న RC 15 ని ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లే న్యూజిలాండ్ లో సాంగ్ షూట్ ని పూర్తి చేసుకున్న ఈ టీమ్ త‌దుప‌రి షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ ని జ‌న‌వ‌రి నుంచి మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. చ‌ర‌ణ్ కూడా అందు కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇందులో చ‌ర‌ణ్ డ్యుయెల్ రోల్ లో తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. తండ్రి పాత్ర‌కు జోడీగా అంజ‌లి న‌టిస్తుండ‌గా, కొడుకు పాత్ర‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ క‌నిపించ‌బోతోంది.

90 వ ద‌శ‌కంలో సాగు పొలిటిక‌ల్ అంశాల నేప‌థ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ తో పాటు రామ్ చ‌ర‌ణ్ రీసెంట్ గా మ‌రో క్రేజీ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన విష‌యం తెలిసిందే. `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్ష‌న్ లో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ మూవీలోనూ రామ్ చ‌ర‌ణ్ రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఓ పాత్ర‌లో వ‌య‌సు మల్లిన వ్య‌క్తిగా.. వీల్ ఛైర్ కే అంకిత‌మైపోయిన వ్య‌క్త‌గా.. అథ్లెట్ గా క‌నిపించ‌నున్నాడు.

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ వ్వ‌డానికి ముందు క‌న్న‌డ డైరెక్ట‌ర్ న‌ర్త‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌డంతో న‌ర్త‌న్ ప్రాజెక్ట్ ప‌క్క‌న పెట్టార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే అది జ‌ర‌గ‌లేద‌ని, న‌ర్త‌న్ తో సినిమాకు చ‌ర‌ణ్ రెడీ అవుతున్నాడ‌ని తాజా స‌మాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైన‌ల్ స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ మూవీలో చ‌ర‌ణ్ స‌రికొత్త మేకోవ‌ర్ తో స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నాడ‌ని, ఈ ప్రాజెక్ట్ కొంత ఆల‌స్యంగా ప్రారంభం అవుతుంద‌ని, యువీ క్రియేష‌న్స్ వారు ఈ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో తెర‌పైకి తీసుకురావాల‌నే ప్లాన్ లో వున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.