Begin typing your search above and press return to search.

సల్మాన్ రుణం అలా తీర్చుకున్న చరణ్‌

By:  Tupaki Desk   |   2 Oct 2022 5:13 AM GMT
సల్మాన్ రుణం అలా తీర్చుకున్న చరణ్‌
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ మరియు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్‌ చరణ్ లేదా చిరంజీవి ముంబై వెళ్లిన సమయంలో ఖచ్చితంగా సల్మాన్‌ ఖాన్‌ ఇంట్లోనే ఉంటారు అనేది అందరికి తెల్సిన విషయమే. ఇక సల్మాన్‌ ఖాన్‌ షూటింగ్‌ కు హైదరాబాద్‌ వస్తే చిరంజీవి ఇంటి నుండి క్యారేజ్‌ వెళ్తుంది.

చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లకు సల్మాన్ ఖాన్ అత్యంత ఆప్తుడిగా మారాడు. ఆ అనుబంధంతోనే రామ్‌ చరణ్ అడిగిన వెంటనే చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో సల్మాన్ ఖాన్‌ అసలు పారితోషికం తీసుకోకుండా నటించాడట. కేవలం నటించడం మాత్రమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సల్మాన్‌ ఖాన్‌ పాల్గొనేందుకు ఓకే చెప్పడం గొప్ప విషయం.

సల్మాన్‌ ఖాన్‌ రుణం ను తీర్చుకునే ఉద్దేశ్యంతోనే రామ్‌ చరణ్‌ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో కనిపించాడు అంటున్నారు. ఇన్ని రోజులు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో రామ్‌ చరణ్ ఉన్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో నిజం ఎంత అనే విషయం లో క్లారిటీ లేదు. తాజాగా సల్మాన్‌ ఖాన్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

ముంబైలో జరిగిన గాడ్‌ ఫాదర్ ప్రెస్ మీట్‌ లో ఒక జర్నలిస్ట్‌ మాట్లాడుతూ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో చరణ్‌ ఉన్నారట నిజమేనా అంటూ ప్రశ్నించగా.. ఈ విషయం మీకు ఎలా తెలిసింది అంటూ సల్మాన్‌ ఖాన్‌ ఎదురు ప్రశ్నించి ఔను అనే సమాధానం ఇచ్చారు.

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ హైదరాబాద్‌ లో జరుగుతున్న షూటింగ్‌ లో నేను వెంకటేష్ గారు పాల్గొంటున్నాము. ఆ సమయంలో చరణ్ అక్కడకు వచ్చారు. పాటలో నేను కూడా కనిపించాలని కోరుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వద్దు అన్నానని.. అయినా కూడా తర్వాత రోజు తన కార్‌ వాన్ తో వచ్చేసి తానే కాస్ట్యూమ్స్ తో రెడీగా సెట్‌ కి వచ్చాడు అంటూ సల్మాన్ ఖాన్‌ పేర్కొన్నాడు.

మొత్తానికి కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌.. వెంకటేష్ లు మాత్రమే కాకుండా ఒక పాటలో రామ్‌ చరణ్ కూడా కనిపించబోతున్నాడు అంటూ క్లారిటీ వచ్చింది. గాడ్‌ ఫాదర్‌ లో సల్మాన్‌ నటించినందుకు రుణం తీర్చుకున్నట్లుగా ఆయన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో చరణ్ కనిపించబోతున్నాడు అంటూ చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఇలా మల్టీ స్టారర్‌ కాంబినేషన్‌ లను స్క్రీన్‌ పై చూడటం చాలా ఆనందంగా ఉందంటూ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.