Begin typing your search above and press return to search.

ఆచార్య ముంగిట చెర్రోపాస‌నం హంగామా

By:  Tupaki Desk   |   24 April 2022 5:21 AM GMT
ఆచార్య ముంగిట చెర్రోపాస‌నం హంగామా
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్.ఆర్.ఆర్ గ్రాండ్ స‌క్సెసైంది. ఈ సినిమా అత‌డిని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక‌పై హిందీ మార్కెట్లోనూ చ‌ర‌ణ్ కి ఎదురే లేద‌న్న టాక్ వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న క్ర‌మంలోనే చెర్రీ కోసం ఆర్.సి 15 లాంటి భారీ ప్లానింగ్ చేసింది ఉపాస‌న‌.

దేశంలోనే గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుతున్న ఎస్.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ సినిమాకి లైన్ క్లియ‌ర్ చేయ‌డం వెనక ఉపాస‌న కృషిని ప్ర‌శంసిస్తున్న వారు ఉన్నారు. చెర్రీ విజ‌యంలో స‌తీమ‌ణి ఉపాస‌న చెరి స‌గం అన్న మురిపెం అభిమానుల్లో ఉంది.

ఇక ఉపాస‌న అంటే చ‌ర‌ణ్ కి ఎంత‌టి ప్రేమాభిమానం అంటే.. తాజాగా అమృత్ స‌ర్ స్వ‌ర్ణ దేవాల‌యంలో మ‌రోసారి నిరూప‌ణ అయ్యింది. ఈ దేవాల‌యంలో లాంగ‌ర్ సేవా కార్య‌క్ర‌మం ఉపాస‌న చేతుల‌మీదుగా నిర్వ‌హించేలా చెర్రీ ఏర్పాటు చేసాడంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి మంచి సేవా కార్య‌క్ర‌మానికి రిప్ర‌జెంట్ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించినందుకు చెర్రీకి థాంక్స్ అంటూ చెప్పింది ఉపాస‌న‌. నీ ప్రేమ నాకు ఆశీర్వాదం అన్నివేళ‌లా అంటూ ఉపాస‌న మురిసిపోయింది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ఆర్సీ 15 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నార‌ని కూడా వెల్ల‌డించింది.

ఆన్న‌ట్టు ఆచార్య రిలీజ్ ముంగిట ఉపాస‌న ప్ర‌చారం ఒక రేంజులో ఉంది. తాజాగా చ‌ర‌ణ్ తో క‌లిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ ముందు అంటూ వెల్ల‌డించారు. #ఆచార్య మూవీ అత్త‌మ్మ కోస‌మ‌ని కూడా ఉపాస‌న ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.

ఉపాస‌న బ్లూ శారీలో క‌నిపిస్తే చెర్రీ పూర్తి బ్లాక్ ష‌రాయిలో సింపుల్ గా క‌నిపించారు. అభిమానులు ఈ ఫోటోని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. త‌దుప‌రి శంక‌ర్ తో సినిమా పూర్తి చేసే క్ర‌మంలో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తోనూ భారీ చిత్రానికి చెర్రీ ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ న‌టించేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ఇంత‌కుముందు చ‌ర‌ణ్ - చిరు ప్ర‌శాంత్ నీల్ తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక చెర్రీ ప్ర‌తి ప్ర‌ణాళిక వెన‌క భార్యామ‌ణి ఉపాస‌న స‌హ‌కారం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.