Begin typing your search above and press return to search.
చెర్రీ.. ఉపాసనల మేకప్ ఆర్టిస్టు పెళ్లి న్యూస్ ఎందుకైంది?
By: Tupaki Desk | 9 Sep 2022 10:30 AM GMTకాలం మారింది. అభిరుచులు మారాయి. గతంలో హీరో.. హీరోయిన్లు.. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. అక్కడెక్కడా దర్శకుడికి తప్పించి మరెవరికీ పెద్దగా గ్లామర్ ఉండేది కాదు. వారిని పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఫలానా హీరో పీఏ సైతం సెలబ్రిటీగా మారిపోయిన సోషల్ మీడియా కాలం.
అలాంటిది మెగాపవర్ స్టార్ రాంచరణ్ లాంటి అగ్ర హీరోకు.. ఆయన సతీమణి అపాసనకు మేకప్ ఆర్టిస్టు అంటే మాటలా? అందులోకి ఆమె వ్యవహారం ఓ పెద్ద సైజు సెలబ్రిటీకి తీసిపోని రీతిలో ఉంటుంది. ఆమె లవ్ మ్యారేజ్ ఇప్పుడు అందరి నోట నానటమే కాదు.. న్యూస్ గా మారిన పరిస్థితి.
అందుకు కారణం.. రీల్ స్టోరీలో ఉన్నన్ని ట్విస్టులు ఆమె పెళ్లి స్టోరీలో ఉండటమే. ఇంతకీ చెర్రీ మేకప్ ఆర్టిస్టు పేరు జెబా హసన్. బాలీవుడ్ బ్యూటీ మాదిరి కనిపించే ఆమె.. పాతకాలంలో మాదరి నటీనటుల ముఖాలకు రంగులు వేసి.. ఏదో బతుకు బతికే రకం కాదు. ఆమెకున్న ఫాలోయింగ్ కాస్తంత ఎక్కువే. ఇంతకీ ఆమె ప్రేమించి పెళ్లి చేసుకునేటోడు కూడా మామూలోడు కాదు. ఏస్ ఆఫ్ స్పేస్ రియాలిటీ షో రెండో సీజన్ లో విజేతగా నిలిచిన తోపు. ఇతగాడి పేరు సల్మాన్ జైదీ.
వీరిద్దరి వివాహం అక్టోబరు 16న జరగనుంది. ఎంగేజ్ మెంట్ ఫిబ్రవరిలో జరిగింది. ఇదంతా రోటీన్ వ్యవహారమే కదా? ఇందులో ట్విస్టు ఏముంది? అన్న సందేహం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. బెబా హసన్ పెళ్లాడనున్న ప్రియుడికి ఎక్స్ గాళ్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు క్రిస్సస్ బారెట్టో. ఓవైపు బెజాతో పెళ్లికి సిద్ధమవుతున్న అతగాడు.. తాజాగా ''ఎక్స్ ఆర్ నెక్ట్స్' అనే డేటింగ్ షోలో మాజీ ప్రియురాలితో కనిపించి సందడి చేశాడు.
ఓవైపు మాజీ ప్రేయసితో డేటింగ్ షోలు చేస్తూ.. మరోవైపు ఇంకో ప్రియురాలితో పెళ్లేమిటి బాసూ? అంటూ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఇంతకీ.. మాజీ ప్రేయసితో రియాల్టీ షోను చేస్తున్న ప్రియుడ్ని పెళ్లి చేసుకుంటున్న జెబా హసన్ తీరును చర్చించుకుంటున్నారు. తామిద్దరం మూడేళ్లుగా క్లోజ్ గా ఉన్నామని.. డేటింగ్ చేస్తున్నట్లుగా చెప్పిన సల్మాన్.. తన ఎక్స్ తో డేటింగ్ షో ఎలా చేయాల్సి వచ్చిందన్న వివరాల్ని షేర్ చేశారు.
తన ఎంగేజ్ మెంట్ కు తొమ్మిది నెలల ముందే ఈ షోను షూట్ చేశారని.. షూట్ సమయంలోనూ తనకు తన ఎక్స్ తో దగ్గర కావాలన్న ఆలోచన రాలేదని క్లారిటీ ఇచ్చేశాడు. మొత్తానికి ఇతగాడి వెర్షన్ బాగానే ఉన్నా.. ఇలాంటి వ్యక్తితో పెళ్లాడుతున్న జెబా హసన్ గుండె ధైర్యాన్ని తెగ మెచ్చేసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.