Begin typing your search above and press return to search.

మెగా పవర్ స్టార్ 'స్టార్ పవర్' కు ఇదే సాక్ష్యం..!

By:  Tupaki Desk   |   20 Dec 2021 11:44 AM GMT
మెగా పవర్ స్టార్ స్టార్ పవర్ కు ఇదే సాక్ష్యం..!
X
మెగాస్టార్ చిరంజీవి వారసత్వంగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాక్టింగ్ - ఫైట్స్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ క్రమంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న చెర్రీ.. ఇప్పుడు నేషనల్ వైడ్ గా క్రేజీ హీరోగా మారుతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాలో రామ్ చరణ్ ఒక హీరోగా నటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ముంబైలో గ్రాండ్ గా RRR ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో చెర్రీ అభిమానులు వచ్చారు.

రామ్ చరణ్ ని చూసేందుకు బారికేడ్లను బద్దలు కొట్టి మరీ దూసుకువచ్చారు. 'జై చరణ్.. జై జై చరణ్' అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెర్రీ పాన్-ఇండియన్ స్టార్ గా ఎదిగాడని చెప్పడానికి.. అతని ఫ్యాన్స్ ఫాలోయింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని ఈ సంఘటన నిరూపిస్తోంది.

తమిళనాడు - కర్ణాటక లలో చరణ్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ముంబైలో జరిగిన సందడి వాతావరణం చూస్తే.. మహారాష్ట్రలోనూ మెగా పవర్ స్టార్ కు ఫ్యాన్స్ ఉన్నారని అర్థం అవుతోంది. 'తుఫాన్' సినిమాతో ఆల్రెడీ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రామ్ చరణ్.. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతారని అభిమానులు ధీమాగా ఉన్నారు.

బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ సైతం 'RRR' ప్రమోషనల్ కంటెట్ చూసి రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్ వా ఉందని.. మీసకట్టు - కళ్లలో పౌరుషం చూస్తుంటే 'మగధీర' ను మించిపోయేలా ఉంటుందనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం RRR హీరోలిద్దరూ తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ భాషల్లో సొంత డబ్బింగ్ చెప్పడం విశేషం.

కాగా, ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న రామ్ చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో తన తండ్రి చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 'మగధీర' 'బ్రూస్లీ' 'ఖైదీ నెం.150' వంటి చిత్రాల్లో చిరుతో కాసేపు కలిసి నటించిన చెర్రీ.. తొలిసారి తన తండ్రితో ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.

అలానే షోమ్యాన్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇలా భారతదేశం గర్వించదగ్గ ఇద్దరు దర్శకులు శంకర్ - రాజమౌళి లతో సినిమాలు చేసిన ఘనత చెర్రీ సొంతం చేసుకున్నాడు. ఇదే క్రమంలో 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో #RC16 ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమా కూడా మల్టీలాంగ్వేజెస్ లలో తెరకెక్కనుంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న రామ్ చరణ్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక హీరోగానే కాకుండా కొణిదెల ప్రొడక్షన్స్ లో సినిమాలు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నారు. 'ఆచార్య' సినిమాతో పాటుగా చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా నిర్మాణంలోనూ మెగా వారసుడు భాగం అయ్యారనే సంగతి తెలిసిందే.