Begin typing your search above and press return to search.
'నాట్యం' చూస్తుంటే బాహుబలి విజువల్స్ గుర్తొచ్చాయి: చరణ్
By: Tupaki Desk | 17 Oct 2021 3:03 AM GMTసంధ్య రాజు ప్రముఖ కూచిపూడి కళాకారిణి. ఆమె ఎన్నో ప్రదర్శనలతో తన ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. 'నాట్యం' ప్రధానమైన కథాకథనాలతో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆమె రంగంలోకి దిగారు. నాట్యం పట్ల తనకి గల ఆసక్తి కారణంగా ఆమె ఈ సినిమాకి నిర్మాతగా కూడా మారారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చరణ్ హాజరయ్యాడు.
ఈ సినిమాను గురించి చరణ్ మాట్లాడుతూ .. " మా నాన్నగారికి .. నాకు సంధ్య రాజు గారి ఫ్యామిలీ చాలా కాలం నుంచి తెలుసు. నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి అది మాత్రమే కారణం కాదు. ఏదో పిలిచారు గదా ఈ సినిమాను గురించి రెండు మాటలు మాట్లాడదామని నేను రాలేదు. రీసెంట్ గా నేను ఈ సినిమాను చూశాను. మొదటి నుంచి చివరివరకూ ఎంతో అద్భుతంగా ఉంది. సాధారణంగా నేను హిట్ సినిమాలకు కూడా ఇంటర్వెల్ కి నిద్రపోయి, క్లైమాక్స్ కి లేస్తాను .. అదీ నా పరిస్థితి. అలాంటిది 'నాట్యం' సినిమాను ఎంతో ఆసక్తికరంగా చూశాను.
డాన్స్ పరంగా .. డైలాగ్స్ పరంగా .. డ్రామా పరంగా .. విజువల్స్ పరంగా కావొచ్చు .. అన్ని కోణాల్లో ఈ సినిమా మిమ్మల్ని సీట్లలో కట్టిపడేస్తుంది. అలాంటి ప్రయత్నం చేసిన రేవంత్ కోరుకొండను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అతని ప్యాషన్ ను నేను ఈ వేదికపై కూడా చూశాను. తప్పకుండా ఇండస్ట్రీకి అతను పెద్ద ఎస్సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. ఈ సినిమాలోని విజువల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ సినిమాలోని ఒక పాటను 'బాహుబలి' స్థాయి విజువల్స్ తో తీశాడు.
వినడానికీ .. చూడటానికి అన్ని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. శ్రావణ్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. ఇంత సోల్ ఫుల్ మ్యూజిక్ ను నేను విని చాలాకాలమైంది. ఈ కథను అర్థం చేసుకుని ఆయన ప్రాణం పెట్టి పనిచేశారనే విషయం నాకు అర్థమైంది. ఆయన మిసెస్ పాడిన 'పోనీ పోనీ' సాంగ్ చాలా బాగుంది .. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. కరుణాకర్ గారు రాసిన పాటలు చాలా బాగున్నాయి. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు" అంటూ అభినందనలు తెలియజేశాడు.