Begin typing your search above and press return to search.

షాకింగ్: సినిమా చూస్తూ నిద్ర‌పోయే అల‌వాటు?

By:  Tupaki Desk   |   17 Oct 2021 7:30 AM GMT
షాకింగ్: సినిమా చూస్తూ నిద్ర‌పోయే అల‌వాటు?
X
సినిమా యంగేజింగ్ గా ఉంటే ఎండ్ కార్డ్ వేసేవ‌ర‌కూ తుది కంటా క‌న్నార్ప‌కుండా చూస్తారు ఆడియెన్. బోరింగ్ అనిపిస్తే కొంద‌రు మ‌ధ్య‌లోనే లేచి వెళుతుంటారు. కొంద‌రైతే అవ‌కాశం దొరికింది క‌దా అని ఏసీ హాల్లో నిదురించేందుకు ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇప్పుడు ఆ రెండో ప‌నిలో త‌న‌కు బోలెడంత అనుభ‌వం ఉంద‌ని చెప్పారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇంత‌కీ ఆయ‌న ఏఏ సినిమాలు చూసేప్పుడు నిద్ర‌పోయారు? అంటే... షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `నాట్యం` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన‌ ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తాను ఇటీవల నాట్యం సినిమా చూశానని ఇందులో ప్రతి సీన్ నచ్చిందని చెప్పాడు. రామ్ చరణ్ ఇంకా వేరే అనుభవాలను కూడా వెల్లడించాడు. నేను సాధారణంగా ఫ‌స్టాఫ్ అవ్వ‌గానే నిద్రపోతాను. ఇండస్ట్రీ హిట్ సినిమాలకు కూడా ఇంటర్వెల్ ముందు నిద్ర లేస్తాను. ఆ సినిమా టైటిల్స్ ఏవీ నన్ను అడగవద్దు కానీ నేను చాలా హిట్ సినిమాలు చూశాను. కానీ నాట్యం ప్రతి ఫ్రేమ్ లో నన్ను ఆక‌ట్టుకుంది`` అని చరణ్ వెల్లడించాడు.

అయితే నాట్యం గురించి చ‌ర‌ణ్ ఏం చెప్పినా ఎవ‌రికీ ఎక్క‌లేదు కానీ.. అత‌డు చెప్పిన ఇత‌ర సంగ‌తులు బాగా వినిపించాయి. ముఖ్యంగా అత‌డు సినిమా మ‌ధ్య‌లో నిదురించే అల‌వాటుంద‌ని చెప్పిన విష‌యం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత సంధ్య రాజుకు సన్నిహితుడిగా నాట్యం గురించి పొగిడేసారనుకుంటే మూవీలో కంటెంట్ ఉందా లేదా? అన్న‌ది ఆడియెన్ డిసైడ్ చేస్తారు. మొదటి సగం పూర్త‌య్యాక నిదురించే అలవాటు గురించే అంద‌రికీ ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌కీ మొదటి సగం తర్వాత రామ్ చరణ్ ని నిద్రపోయేలా చేసిన ఆ సినిమాలేవీ అంటూ ఆరాలు మొద‌లెట్టేశారు సోష‌ల్ మీడియాల్లో. నాట్యం ఈ నెల 22 న విడుదలవుతుంది. చ‌ర‌ణ్ లాంటి పెద్ద హీరో ఫిదా అయ్యాన‌ని ప్ర‌చారం చేసారు కాబ‌ట్టి ఓపెనింగ్స్ ఫుల్ అవుతాయేమో చూడాలి.