Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ `బిగ్ బాస్` జాకెట్ ఖ‌రీదెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Sep 2021 4:30 PM GMT
చ‌ర‌ణ్ `బిగ్ బాస్` జాకెట్ ఖ‌రీదెంతో తెలుసా?
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బిగ్ బాస్ సీజ‌న్-5 కి నిన్న‌టి రోజున గెస్ట్ గా విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. హోస్ట్ నాగార్జున చ‌ర‌ణ్ ని గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్పి అభినందించారు. ఇంకా చ‌ర‌ణ్ తో పాటు యూత్ స్టార్ నితిన్.. హీరోయిన్లు త‌మ‌న్నా.. న‌భా న‌టేష్ కూడా పాల్గొన్నారు. దీంతో షో నిన్న కాస్త స‌ర‌దాగా సాగింది. అయితే ఈ షోలో భాగంగా చ‌ర‌ణ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు కూడా నాగార్జున రివీల్ చేసారు. డిస్నీ హాట్ స్టార్ తెలుగు వెర్ష‌న్ కి చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు నిన్న రివీల్ అయింది. హాట్ స్టార్ ని ప్ర‌మోట్ చేసే బాధ్య‌తలు చ‌ర‌ణ్ పైనే ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అయితే చ‌ర‌ణ్ నిన్న ఆన్ స్క్రీన్ పై స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా క‌నిపించారు. బ్లాక్ టీ ష‌ర్టు.. డెనిమ్ జీన్స్ ద‌రించారు. ష‌ర్ట్ పై డెనిమ్ జాకెట్ ధ‌రించారు. ఫ్యాష‌న్ బ్రాండ్ డ‌స్ట్ ఆఫ్ గాడ్ త‌యారు చేసిన జోక‌న్ డెనిమ్ ధ‌ర అక్ష‌రాల‌ 1.3 ల‌క్ష‌లు అట. చ‌ర‌ణ్ ఈవెంట్ల కోసం చాలా ప్ర‌త్యేకంగా రెడీ అవుతారు. ఖ‌రీదైన వ‌స్త్రాల్లో క‌నిపించ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. సింపుల్ గా ఉండే వ‌స్త్రాల్లోనే త‌న‌లో రిచ్ నెస్ చూపిస్తుంటారు. కానీ నిన్న‌టి రోజున ట్రెండీ ఫ్యాష‌న్ బుల్ ప‌ర్స‌న్ గాను క‌నిపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేసారు. ఇక చ‌ర‌ణ్ షోలోని కంటస్టెంట్లు అంద‌రితోనూ క్లుప్తంగా మాట్లాడారు. చ‌ర‌ణ్ ఎంట్రీ తో వాళ్లు హ్యాపీగా ఫీల‌య్యారు. బిగ్ స్టార్స్ ని క‌ల్పించే వేదిక‌గా బిగ్ బాస్ నిలిచింద‌ని సంతోషం వ్య‌క్తం చేసారు.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ `ఆర్.ఆర్.ఆర్` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో సినిమాలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో చ‌ర‌ణ్ క్రేజ్ మూడింత‌లు రెట్టింపు అవుతుంద‌నే అంచ‌నాలున్నాయి. అలాగే శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో చ‌ర‌ణ్ త‌న 15వ చిత్రాన్ని ఇటీవ‌ల ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ న‌టి కియారా అద్వాణీ న‌టిస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.