Begin typing your search above and press return to search.

భీమ్ డాన్స్ పై అల్లూరి కామెంట్స్

By:  Tupaki Desk   |   26 Dec 2021 6:55 AM GMT
భీమ్ డాన్స్ పై అల్లూరి కామెంట్స్
X
టాలీవుడ్ లో ఇద్దరు సమ ఉజ్జీలైన స్టార్‌ హీరోల కలిసి ఒక సినిమా లో నటించడం జరిగి దశాబ్దాలు అయ్యింది. మద్యలో కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు వచ్చినా కూడా అభిమానులకు అవి పూర్తి స్థాయి మల్టీ స్టారర్ ఫీలింగ్ ను కలిగించలేక పోయాయి. ఆ ఫీల్ ను కలిగించేందుకు గాను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ముందుకు వచ్చాడు. ఆయన ఏం చేసినా అద్బుతం.. ఏం చూపిస్తే దాన్ని జనాలు నెత్తిన పెట్టుకుంటారు. మల్టీ స్టారర్ సినిమాలంటే దర్శకులు భయపడుతున్న ఈ సమయంలో రాజమౌళి కథపై నమ్మకంతో.. తనపై తనకు ఉన్న నమ్మకంతో ఈ సినిమాను తీశాడు. మల్టీ స్టారర్ సినిమా చేయాలంటే ఇద్దరు హీరోల మద్య మంచి సన్నిహిత్యం ఉండాలి. ఆ సన్నిహిత్యం ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ ల మద్య చాలానే ఉంది. వారిద్దరి మద్య స్నేహం.. వారిద్దరు సినిమా కోసం పడే కష్టం రాజమౌళి పనిని సగం తగ్గించేశాయి. రాజమౌళి పలు సందర్బాల్లో వారిద్దరు మంచి స్నేహితులు అవ్వడం వల్ల నాకు సగం పని తగ్గిందని చెప్పుకొచ్చాడు.

నిజంగానే వారిద్దరు మంచి స్నేహితులు అనడంలో సందేహం లేదు. ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకోవడమే అందుకు నిదర్శణం. టాలీవుడ్‌ హీరోల అభిమానులు గొడవలు పడుతూ ఉంటారు.. కాని ఆ హీరోలు మాత్రం స్నేహితులు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్‌ లు బెస్ట్‌ ఫ్రెండ్స్ అనడంలో సందేహం లేదు. ఒక స్టార్‌ హీరో గురించి మరో స్టార్‌ హీరో మాట్లాడటం.. అది కూడా పొగుడుతూ మాట్లాడటం అనేది సీనియర్‌ హీరోల విషయంలో మనం ఎప్పుడు చూడలేదు. కాని రామ్‌ చరణ్‌ గురించి ఎన్టీఆర్... ఎన్టీఆర్‌ గురించి రామ్‌ చరణ్‌ పలు సందర్బాల్లో పలు వేదికల మీద మాట్లాడుకున్నారు. తాజాగా మరోసారి వారిద్దరి యొక్క స్నేహం గురించిన చర్చ వచ్చింది.

ఎన్టీఆర్‌ బెస్ట్‌ డాన్సర్‌ అనే విషయం అందరికి తెల్సిందే. ఎన్టీఆర్ తో పాటు చరణ్‌ కూడా మంచి డాన్సర్‌. అలాంటి చరణ్‌ తాజాగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ డాన్స్ చేస్తూ ఉంటే నేను అలాగే చూస్తూ ఉండేవాడిని అన్నాడు. రాజమౌళి గారు ఎన్టీఆర్ తో డాన్స్ చేసే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం ను నేను ఎంజాయ్ చేశాను అంటూ రామ్‌ చరణ్ చెప్పుకొచ్చాడు. ఆ విషయం పై ఎన్టీఆర్ కూడా స్పందించాడు. రామ్‌ చరణ్‌ కూడా అద్బుతమైన డాన్సర్‌.. అతడి డాన్స్ బాగుంటుందని ఎన్టీఆర్‌ అన్నాడు.

మొత్తానికి ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం.. ముఖ్యంగా ప్రశంసలు చేసుకోవడం.. ఒకరి యాక్టింగ్‌ గురించి ఒకరు.. ఒకరి డాన్స్ గురించి ఒకరు.. ఒకరి అల్లరి గురించి మరొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు అభిమానులకు కూడా కన్నుల పండుగ అన్నట్లుగా ఉంది. ఆర్ ఆర్‌ ఆర్‌ ను జక్కన్న జనవరి 7వ తారీకున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో రూపొందించాడు. ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆలియా భట్‌ మరియు అజయ్ దేవగన్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శ్రియ ఈ సినిమా లో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్‌ విజయాన్ని ఇప్పటికే దక్కించుకుంది.