Begin typing your search above and press return to search.
తేజుకు, నాకు లెక్చర్ పీకే కాండిడేట్ వీడు: వైష్ణవ్ పై రాంచరణ్ కామెంట్స్
By: Tupaki Desk | 18 Feb 2021 3:30 AM GMTఉప్పెన మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న మెగాపవర్ స్టార్ రాంచరణ్.. ఉప్పెన బృందంతో పాటు మెగా డెబ్యూహీరో వైష్ణవ్ పై కొన్ని ఛలోక్తులు విసిరాడు. ఆయన మాట్లాడుతూ.. 'పంజా వైష్ణవ్ తేజ్.. కనిపించేంత అమాయకుడు కాదు. ఈ అబ్బాయితో కొంచం జాగ్రత్తగా ఉండండి. సిగ్గుపడుతూ నవ్వుతూ ఉన్నాడు. కానీ వాడి లోపల ఒక విస్పూటం, వాల్కెనోలాగా ఉంటాడు.
అప్పుడప్పుడు తేజుకు, నాకు లెక్చర్స్ పీకే కాండిడేట్ వీడు' అంటూ స్టేజిమీద సరదా పట్టించాడు. అలాగే మా మెగా యంగ్ హీరోలందరిలో బాలన్సుడ్ ఆలోచనలు, మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అలాంటోడు సినిమా తీసి సక్సెస్ అయ్యాడంటే మాకు పెద్దగా ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే ఇలాంటి కుర్రోడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడనే నమ్మకం మాకుంది అంటూ వైష్ణవ్ పై మెగా ఫ్యామిలీ నమ్మకాన్ని బయటపెట్టాడు చరణ్.
అంతేగాక గ్రేట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నాకు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇలాంటి పెర్ఫార్మన్స్ చేయడానికి.. వైష్ణవ్ ఫస్ట్ సినిమాకే గ్రేట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం గ్రేట్. నిజానికి వైష్ణవ్ యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు ప్రోత్సహించిన మొదటి వ్యక్తులు నాన్నగారు చిరంజీవి, బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
చిరంజీవి గారు కేవలం ప్రోత్సాహం అందించారు కానీ యాక్టింగ్ పరంగా ట్రైనింగ్ ఇప్పించి ఓ గురువులాగా నడిపింది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే. వైష్ణవ్ అదృష్టం అలాంటి ఇద్దరు వ్యక్తులు నీ లైఫ్ లో, అలాగే మనందరి లైఫ్ లో ఉండటం అదృష్టం. బహుశా నా సినిమాలకు కూడా అంత టైం కేటాయించారో లేదో తెలియదు కానీ వైష్ణవ్ సినిమాకు కేటాయించారు. సినిమా రెండు రోజుల ముందు చూసే నిర్మాతలకు భరోసా ఇచ్చారు' అంటూ చెప్పుకొచ్చాడు.