Begin typing your search above and press return to search.
జక్కన్న చేసిన పనికి స్టార్ హీరో ఫ్యాన్స్ గుర్రు!
By: Tupaki Desk | 2 Jan 2022 8:49 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ వాయిదా రకరకాల డైలమాలకు కారణమైన సంగతి తెలిసిందే. రిలీజ్ నేపథ్యంలో రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి ఈ సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు. ముంబై..చెన్నై.. కేరళలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు. ఇలా అన్ని చేసేస్తుంటే రిలీజ్ పక్కా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే `ఆర్.ఆర్.ఆర్` టీమ్ కి ఓమిక్రాన్ వైరస్ గుర్తొచ్చింది. ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా రిలీజ్ వాయిదా వేసారు. దీంతో అభిమానులు ఒక్కసారగా భగ్గుంటున్నారు. దర్శకుడు రాజమౌళిని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ అభిమానులు ముందు వరుసలో ఉన్నారు.
``రాజమౌళి ఒక ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి సంవత్సరాలు పడుతుంది. అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కోసం మిమ్మల్ని సంపద్రిస్తే దయచేసి నో చెప్పండి. ఎందుకంటే మీరు కమిట్ అయితే మహాభారతం ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. మూడు సంవత్సరాలకు ఒకసారి కాదు. ఏడాదికి రెండుసార్లు మా అభిమాన హీరో ఎన్టీఆర్ ని తెరపై చూడాలనుకుంటున్నానని ఓ నెటిజనుడు కామెంట్ చేసాడు. ఇక ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి మూడు సంవత్సరాలు దాటిపోయింది``. అందుకే తారక్ అభిమానులు ఇలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చరణ్ అభిమానులు చాలా అసహనంతో ఉన్నారు.
కానీ అంతగా ఓపెన్ అవ్వలేదు. `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ కాకపోయినా వచ్చె నెలలో `ఆచార్య` సినిమాతోనైనా చరణ్ మెప్పించే అవకాశం ఉంది. అందుకు చరణ్ ఫ్యాన్స్ కాస్త కూల్ గా కనిపిస్తున్నారు. అయినా రాజమౌళి మాత్రం ఏం చేయగలరు? తాను ఒకటి అనుకుంటే..మరొకటి జరుగుతోంది. ఓమిక్రాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే తీవ్రతరం అవుతుంది. అలాంటి సమయంలో సినిమాలు రిలీజ్ అయితే భారీ నష్టాలు తప్పవు. అందుకే నిర్మాతల శ్రేయస్సుని..హీరోల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు రిలీజ్ చేయాల్సి ఉంది. ఇది రాజమౌళి ఊహించని విపత్తు. అంతా మన మంచికేనని పరిశ్రమ అనుకోవాలి. ప్రస్తుతానికి తారక్ సినిమా ఏదీ రిలీజ్ కాదు కాబట్టి తన ఫ్యాన్స్ వరకూ గుర్రుమనడం సమంజసమే.