Begin typing your search above and press return to search.
అల్లూరి గెటప్ లో చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చే!
By: Tupaki Desk | 25 March 2022 7:30 AM GMTమెగా-నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిన్నటి సాయంత్రం నుంచి బెనిపిట్ షో థియేటర్ల వద్ద హడావుడి మొదలైపోయింది. థియేటర్లని అందంగా పూలమాలతో ముస్తాబు చేసి చరణ్..తారక్..జక్కన్నల భారీ కటౌట్లను థియేటర్ ముందు ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు. ఇక వ్యక్తిగతంగా చరణ్..తారక్ అభిమానులు ప్రత్యేక అభిమానం ఎవరికి వారుగా చాటుకుంటున్నారు.
ఇలాంటి సన్నివేశం విదేశాల్లో సైతం చోటు చేసుకుంది. తారక్..చరణ్ అభిమానులు వినూత్నంగా హీరోలపై తమ ప్రేమని చాటారు. తాజాగా నిన్నటి రోజున చరణ్ అభిమానులు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో చేసిన హంగామా నెట్టింట వైరల్ గా మారింది. చరణ్ సినిమాలో పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రని చరణ్ ఫ్యాన్స్ బయట అనుకరించే ప్రయత్నం చేసారు.
100మందికి పైగా యువకులు అల్లూరి సీతారామరాజు గెటప్ ను ధరించారు. అదే గెటప్ లో భారీగా బైక్ ర్యాలీ చేశారు. జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ.. భాగ్యనగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. దానికి సంబంధించిన వీడియో..ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అగ్ర హీరోల సినిమాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మిగతా చోట్లకంటే అతిగానే ఉంటుంది. హైదరాబాద్ సిటీ పరిధిలో కొన్ని థియేటర్లు ఫ్యాన్స్ కి ప్రత్యేకం. క్రాస్ రోడ్స్..మూసాపేట్..కూకట్ పల్లి లాంటి ఏరియాల్లో అభిమానుల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెగా-నందమూరి అభిమానులు తమ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ ప్రాంతాల్లో కాస్త గట్టిగానే హడావుడి చేస్తారు.
అందుకే సెలబ్రిటీలు సైతం ఆయా థియేటర్లో మొదటి షోలు..బెనిఫిట్ షోలు వీక్షించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. రాజమౌళి భ్రమరాంభ థియేటర్లో `ఆర్ ఆర్ ఆర్` చూస్తానని ముందే చెప్పిన సంగతి తెలిసిందే. అభిమానుల పల్స్ తెలుసుకోవడం కోసమే మేకర్స్ రిలీజ్ సమయంలో వాళ్లతో మమేకం అవుతుంటారు.
చరణ్..తారక్ ల్ని సైతం అలాంటి అవకాశం ఉంటే వినియోగించుకోమని జక్కన్న సూచించారు. అందుకు తెలివిగా ఇద్దరు ఫ్యాన్స్ తో ఇబ్బంది లేకుండా సినిమా ఎలా చూడాలో? మీరే చెప్పండి అంటూ సలహా కూడా కోరిన సంగతి తెలిసిందే.