Begin typing your search above and press return to search.
రేర్ క్లిక్! దోస్త్ అంటే చెర్రీకి ఎంత ప్రేమ..!!
By: Tupaki Desk | 20 May 2022 4:30 PM GMTఇది వెరీ రేర్ క్లిక్.. ఇరువురు హీరోల అభిమానులు పదే పదే తలచుకునే లాంటి రేర్ హగ్ ఇది. ఒక మనిషిపై ఇంకో మనిషికి ప్రేమ ఉందా లేదా? అభిమానం స్నేహం ఉన్నాయా లేవా? అనేందుకు ఇది పక్కాగా ప్రూఫ్. తన స్నేహితుడు ఎన్టీఆర్ పుట్టినరోజున ఇలా టైట్ హగ్ ఇచ్చిన రామ్ చరణ్.. నిజమైన స్నేహంలో ఉండే ప్రేమాభిమానాలకు సింబాలిక్ గా నిలిచారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందే ఆ ఇద్దరూ మంచి స్నేహితులు. అందుకే తెరపై అది అద్భుతంగా ప్రతిఫలించింది. మూవీ తమను మరింత మంచి స్నేహితులను చేసిందని సినిమా ప్రమోషన్స్ లో చాలాసార్లు ఆ ఇద్దరూ వ్యాఖ్యానించారు.
ఈ రోజు తారక్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో తారక్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. అరుదైన ఈ హగ్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసుకున్నారు. సోదరుడు.. సహనటుడు.. స్నేహితుడు… నువ్వు నాకు ఎవరో మాటల్లో నిర్వచించగలవని నేను అనుకోను! పుట్టినరోజు శుభాకాంక్షలు.. నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తాను! .. అని ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు నటీనటుల అభిమానులు వారి ఆన్ స్క్రీన్.... ఆఫ్ ద స్క్రీన్ బంధం గురించి సంతోషంగా ఉన్నారు.
ఆర్.ఆర్.ఆర్ తో 1000 కోట్ల క్లబ్ హీరోలుగా సంచలనం సృష్టించారు. మరోసారి 1000 కోట్ల క్లబ్ సినిమాలో నటించేందుకు ప్రణాళిక ఏదైనా రచిస్తున్నారా? అందుకు ఇది ఒక ఆరంభం అని అనుకోవాలా? మునుముందు శంకర్ - ప్రశాంత్ నీల్ వంటి టాప్ డైరెక్టర్ల నిర్ధేశనంలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తారనే భావించాలి. అలాగే ఆర్.ఆర్.ఆర్ తర్వాత మరోసారి ఆ ఇద్దరు స్నేహితులను కలుపుతూ జక్కన్న ఇంకెలాంటి ప్లాన్ చేస్తారో కూడా వేచి చూడాలి.