Begin typing your search above and press return to search.
ఇటలీలోని ఫ్లోరెన్స్ లో మిస్టర్ సీ హల్ చల్
By: Tupaki Desk | 15 Jun 2022 10:30 AM GMTస్టార్ హీరోలు ఫ్యామిలీతో కలిసి సినిమా షూటింగ్ లో గ్యాప్ లభిస్తే చాలు విదేశాలకు ఎగిరిపోతుంటారు. అక్కడి అందమైన ప్రత్యేశాల్లో కూల్ గా విహరిస్తూ అహ్లాదకర క్షణాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. టాలీవుడ్ హీరోల్లో అత్యంత ఎక్కువగా విదేశాల్లో విహరించే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్యాప్ దొరికితే చాలు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి నచ్చిన కంట్రీలో వాలిపోతుంటారు. ఆ తరువాత ఆ స్థాయిలో మెగా జంట వరుస వెకేషన్ లలో హల్ చల్ చేస్తోంది.
ఇటీవల ఫిన్ లాండ్ లో హల్ చల్ చేసిన ఈ జంట తాజాగా తమ మ్యారేజ్ 10 యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా ఇటలీలోని ఫ్లోరెన్స్ కి వెళ్లింది. అక్కడి అందాల మధ్య ఈ జంట తమ మ్యారేజ్ 10 యానివర్సరీ సెలబ్రేషన్స్ ని జరుపుకుంది. మ్యారేజ్ యానివర్సరీ రోజు చరణ్ - ఉపాసన వైట్ అండ్ వైట్ లో దర్శన మిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వైట్ అండ్ వైట్ లో హ్యాట్స్ పెట్టుకుని ఈ జంట సూపర్ కూల్ గా కనిపించింది. ఆ తరువాత రోజు వింటేజ్ డ్రెస్సుల్లో రాయల్ లుక్ లో కనిపించి అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు పెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూస్తుంటే ఈ జంట ఇటలీలోని ఫ్లోరెన్స్ లో అందమైన అద్భుత క్షణాలని ఆస్వాదిస్తున్నట్టుగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే హీరో రామ్ చరణ్ తనకు అత్యంత ఇష్టమైన గుర్రపు స్వారీ ని చేయడం ఆకట్టుకుంటోంది. గుర్రపు స్వారీ అనేది చరణ్ కున్న హాబీ. దీన్ని తను చాలా ఇష్టంగా చేస్తారు కూడా. అదే తాజా బయటికి వచ్చిన ఫొటోలో కనిపిస్తోంది. ఖాకీ కలర్ ప్యాంట్, వైట్ షర్ట్.. తనకు హ్యాట్ ధరించి చాలా కూల్ గా గుర్రపు స్వారీ చేస్తూ చరణ్ కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా వుంటే 'ట్రిపుల్ ఆర్' తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్న చరణ్ ప్రస్తుతం ఫేమస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తన 15వ మూవీని చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
తాజాగా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో చరణ్ తన 10 వ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ఇటలీలోని ఫ్లోరెన్స్ కి వెళ్లారు. తిరిగి హైదరాబాద్ కు రాగానే శంకర్ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది.