Begin typing your search above and press return to search.

అలా చేయాల‌న్న‌ది అమ్మ కోరిక‌ట‌

By:  Tupaki Desk   |   20 April 2022 2:39 PM GMT
అలా చేయాల‌న్న‌ది అమ్మ కోరిక‌ట‌
X
`ట్రిపుల్ ఆర్` వంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత మెగా వ‌ప‌ర్ స్టార్ న‌టించిన చిత్రం `ఆచార్య‌`. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఈ చిత్రంలో మెగా వ‌ప‌ర్ స్టార్ క‌థ‌కు కీల‌కంగా నిలిచే సిద్ధా పాత్ర‌లో న‌టించారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 29న ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ తో ప్ర‌మోష‌న్స్ ని చిత్ర బృందం ప్రారంభించారు.

ప్ర‌త్యేకంగా మెగాస్టార్ చిరంజీవి - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌పై చిత్రీక‌రించిన `భ‌లే భలే బంజారా..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని తాజాగా విడుద‌ల చేశారు. ఇదిలా వుంటే సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, కొర‌టాల శివ పాల్గొన‌గా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూకు సంబంధించిన వీడియోని మేక‌ర్స్ బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. ఈ మూవీ సెట్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంట‌ని అడిగిన యాంక‌ర్ ప్ర‌శ్న‌కు హీరో రామ్ చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.

`ఈ ప్రాజెక్ట్ అనుకున్న‌ప్పుడు నిర్మాత‌గా నేను వుండాల‌నుకున్నాను. అయితే `ట్రిపుల్ ఆర్‌` షూటింగ్ కార‌ణంగా నిర్మాత‌గా హండ్రెడ్ ప‌ర్సెంట్ నా వంతు బాధ్య‌త‌ని నిర్వ‌ర్తించ‌లేక‌పోయాను. దీంతో నిరంజ‌న్ గారికి ఆ బాధ్య‌తల్ని అప్ప‌గించాం. నిరంజ‌న్ గారి ప్రొడ‌క్ష‌న్ లో నాతో ఓ సినిమాని కొర‌టాల శివ చేయాల‌నుకున్నారు.

అది కార్య‌రూపం దాల్చ‌లేదు. అందుకే ఆయ‌న‌కు ఈ సినిమా ఇచ్చాం. అయితే ఈ సినిమా కార్య‌రూపం దాల్చిందంటే దానికి కార‌ణం రాజ‌మౌళి గారే. ఎలా అంటే `ట్రిపుల్ ఆర్` చేస్తుండ‌గా ఈ సినిమా చేసే అవ‌కాశం లేదు. కానీ రాజ‌మౌళి ఆ అవ‌కాశం ఇవ్వ‌డం అనేది చాలా క‌ష్టంతో కూడుకున్న‌ది. అయితే ఆ భారాన్ని కొర‌టాల గారు, నేను నాన్న‌కు అప్ప‌గించాం.

నేను నాన్న క‌లిసి ఒకే ఫ్రేమ్ లో క‌నిపించాల‌న్న‌ది అమ్మ కోరిక‌. సాంగ్ ల‌ల్లో నాన్న‌, నేను క‌లిసి క‌నిపించాం కానీ పూర్తి స్థాయి పాత్ర‌ల్లో మాత్రం ఏ సినిమాలో క‌నిపించ‌లేదు. అలాంటి పాత్ర‌ల్లో మ‌మ్మ‌ల్ని చూడాల‌న్న‌ది మా అమ్మ విష్‌. ఆమె వెన‌కుండి మా నాన్న‌గారిని ముందుకు న‌డిపించి రాజ‌మౌళి గారిని ఒప్పించి నా డేట్స్ ఇచ్చేలా చేసింది. కోవిడ్ టైమ్ లో షూటింగ్స్ జ‌ర‌గ లేదు.

అలాంటి టైమ్ లో త‌న సినిమా షూట్ కు నా డేట్స్ అవ‌స‌రం అని తెలిసినా మా నాన్న అడ‌గ‌డంతో వెంట‌నే అంగీక‌రించి నా డేట్స్ కేటాయించేలా రాజ‌మౌళి స‌హ‌క‌రించారు. మా అమ్మ ఆశీస్సులు బ‌లంగా వుండ‌టం వ‌ల్లే ఇది జ‌రిగింది. ఈ విష‌యంలో మాకు స‌హ‌క‌రించిన రాజ‌మౌళి గారికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను` అన్నారు రామ్ చ‌ర‌ణ్‌.

అంతే కాకుండా రాజ‌మౌళి ఎప్పుడైతే షూటింగ్ కి గ్యాప్ ఇస్తూ వ‌చ్చారో ఆ టైమ్ ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌రిగ్గా వాడుకుంటూ వ‌చ్చారు. కెరీర్‌లో కొన్ని క్యారెక్ట‌ర్ లు మాత్ర‌మే సింక్ అవుతూ వుంటాయి. అలా ఈ మ‌ధ్య కాలంలో నాకు బాగా సింక్ అయిన పాత్రలు రంగ‌స్థ‌లం చిట్టిబాబు, ట్రిపుల్ ఆర్ రామ‌రాజు, ఆచార్య‌లోని సిద్దా ..ఈ మూడు పాత్ర‌లు నావేనా అనేంత‌గా న‌న్ను నేను బాగా ఇన్ వాల్వ్ అయి ఈ పాత్ర‌ల్లో న‌టించాను. ఆ పాత్ర‌ల‌ని అంత‌లా ద‌ర్శ‌కులు రాశారు` అని చెప్పుకొచ్చారు రామ్ చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం ఈ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.