Begin typing your search above and press return to search.

ఎవరు ఈ కోడి రామ్మూర్తి నాయుడు.. చరణ్ ఫ్యాన్స్ వెతుకులాట

By:  Tupaki Desk   |   27 April 2023 5:12 PM
ఎవరు ఈ కోడి రామ్మూర్తి నాయుడు.. చరణ్ ఫ్యాన్స్ వెతుకులాట
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇదే సమయంలో రామ్ చరణ్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాకు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వం వహించబోతున్నాడు.

మొదటి సినిమా తోనే వంద కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న బుచ్చి బాబు చెప్పిన కథ నచ్చడంతో రామ్‌ చరణ్ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. మొదటి నుండి కూడా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత వచ్చింది. ఈ సినిమా ను బాబీ బిల్డర్‌ కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా రూపొందించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కోడి రామ్మూర్తి గురించి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన పుట్టుక మరియు మరణం గురించి సరైన సమాచారం లేదు కానీ ఆయన స్వాతంత్య్రం కు పూర్వమే చనిపోయారు అనేది స్థానికుల వాదన. రెజ్లర్ గా బాడీ బిల్డర్ గా ఎన్నో గొప్ప విజయాలను ఆయన సొంతం చేసుకోవడం జరిగిందట.

కింగ్ జార్జ్‌ అప్పట్లో రామ్మూర్తి నాయుడు ప్రతిభను మెచ్చుకుని హెర్క్యూలెస్ అనే బిరుదును ఇచ్చాడట. రామ్మూర్తి నాయుడు స్వస్థలం విశాఖపట్నంలోని వీరఘట్టంగా చెబుతున్నారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహించిన మావయ్య ప్రోత్సహించడంతో రామ్మూర్తి నాయుడు రెజ్లింగ్ మరియు బాడీ బిల్డింగ్ లో రాణించాడు.

అప్పట్లోనే ఎన్నో సాహసాలు చేసిన రామ్మూర్తి నాయుడు యొక్క బయోపిక్ ను బుచ్చి బాబు చేయబోతున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఈ పేరును గూగుల్‌ లో తెగ వెదికేస్తున్నారు. బుచ్చి బాబు కమర్షియల్ గా రామ్మూర్తి నాయుడు బయోపిక్ ను మార్చడం జరిగిందట. అంతే కాకుండా డబుల్‌ రోల్‌ లో రామ్‌ చరణ్ ను చూపించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.