Begin typing your search above and press return to search.

వీడియో : నిజంగా చరణ్ ఉన్నది ముంబయిలోనా?

By:  Tupaki Desk   |   4 April 2022 2:30 PM GMT
వీడియో : నిజంగా చరణ్ ఉన్నది ముంబయిలోనా?
X
మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులకు కొదవ లేదు. ఆయన మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు అవ్వడంతో పాటు ఆయన ఒక మగధీర తో పాటు ఎన్నో భారీ సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి తన స్టార్‌ డమ్‌ ను పెంచుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని.. తండ్రి నీడ నుండి ఇప్పటికే బయటకు వచ్చేసి తనను తాను భారీ హీరోగా నిలుపుకున్నాడు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా రామ్‌ చరణ్ కు మంచి ఫాలోయింగ్‌ పెరిగింది. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా తో ఉత్తరాదిన ఖచ్చితంగా రాజమౌళికి మంచి డిమాండ్‌ అయితే పెరిగింది. కాని ఆ డిమాండ్‌ ఇంత ఉంటుందా అనేది మాత్రం ఎవ్వరు ఊహించలేకుండా ఉన్నారు. ఆయన యొక్క స్థాయికి అక్కడి మీడియా వారు కూడా అవాక్కవుతున్నారు.

రామ్‌ చరణ్‌ ఇటీవల ముంబయి వెళ్లాడు. అక్కడ ఆర్ ఆర్‌ ఆర్‌ ఆడుతున్న థియేటర్ కు వెళ్లాడు. ఆ సమయంలో ఆయన్ను చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి ప్రతి ఒక్కరు నోరు వెళ్లబెట్టారు. బాబోయ్‌ ఇంత రచ్చ ఏంట్రా అనుకుంటూ మీడియా వారు కూడా ముక్కున వేలేసుకున్నారు అంటున్నారు. బాలీవుడ్‌ స్టార్ కాకుండా ముంబయిలో ఒక సౌత్‌ హీరోకు అది కాకుండా ఒక తెలుగు హీరోకు ఇంతటి క్రేజ్ ఏంటీ అంటూ వారు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్‌ చుట్టు చేరిన అభిమానులకు సంబంధించిన వీడియో లో వైరల్‌ అవుతున్నాయి. ముంబయి లో రామ్‌ చరణ్ కు ఇంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏంట్రీ బాబు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. రామ్‌ చరణ్ ను చూసేందుకు జనాలు ఎగబడ్డ తీరుతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా షాక్‌ అయ్యారట.

గత కొన్ని గంటలుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఆ వీడియో నిజమేనా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ముంబయిలోనే ఆ వీడియో తీశారా.. లేదంటే ఏదైనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్‌ వద్ద తీశారా అనేది కొందరి అభిమానం. ఆ అనుమానం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే రామ్‌ చరణ్ ముంబయి వెళ్లినట్లుగా ఆయన పీఆర్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించారు. కనుక ముంబయిలో రామ్‌ చరణ్ క్రేజ్ వీడియో లు ఫేక్ కాదు.