Begin typing your search above and press return to search.

RC15: రెండు పాత్రల్లో రామ్ చరణ్.. కానీ..?

By:  Tupaki Desk   |   16 Feb 2022 2:30 AM GMT
RC15: రెండు పాత్రల్లో రామ్ చరణ్.. కానీ..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది చెర్రీ కెరీర్ లో 15వ చిత్రం. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్ రోల్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

RC15 చిత్రాన్ని శంకర్ శైలి సందేశాత్మక అంశాలతో కూడిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. యంగ్ ఫాదర్ మరియు సన్ గా చెర్రీ కనిపించనున్నారట. కాకపోతే ఈ రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించవని అంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో షెడ్యూల్ లో యంగ్ ఫాదర్ రోల్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.

చరణ్ గతంలో 'నాయక్' సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు RC15 లో రెండు రోల్స్ లో కనిపించనున్నారు. ఇది మెగా డ్యాన్స్ కు చాలా సర్ప్రైజింగ్ గా ఉండే అవకాశం ఉంది. అందులో ఒక పాత్ర పంచె కట్టులో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఒక రాజకీయ నాయకుడిగా ఉండబోతోంది. ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటుందట. మరొకటి ప్రభుత్వోద్యోగి పాత్ర అని అంటున్నారు.

విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న మైలురాయి 50వ చిత్రం కావడంతో బడ్జెట్ కు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. భారీ తారాగణం - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఇందులో భాగం అవుతున్నారు.

ఈ సినిమాలో అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తారనే టాక్ ఉంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ పాటలకు సాహిత్యం అందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

2023 సంక్రాంతికి శంకర్-చరణ్ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న #RC15 ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.