Begin typing your search above and press return to search.

800 ఏళ్ల‌నాటి శివాల‌యంలో చ‌ర‌ణోపాస‌నం!

By:  Tupaki Desk   |   5 March 2019 5:32 AM GMT
800 ఏళ్ల‌నాటి శివాల‌యంలో చ‌ర‌ణోపాస‌నం!
X
800 ఏళ్ల చ‌రిత్ర ఉన్న అత్యంత పురాత‌న శివాల‌యం అది.. 400 ఏళ్ల క్రిత‌మే ఉపాస‌న పూర్వీకులు ఆ దేవాల‌యానికి పూజ‌లాచరించారు. రెగ్యుల‌ర్ గా వెళుతూ శివ‌నామ‌స్మ‌ర‌ణం చేసేవారు. నాలుగు సెంచ‌రీల క్రితం ఆ పురాత‌న శివాల‌యానికి చుట్టూ ఒక కోట‌ను నిర్మించింది కామినేని పూర్వీకులేన‌ట‌. ఇప్ప‌టికీ ఆ ఆల‌యాన్ని సంర‌క్షిస్తూనే ఉన్నారు. వినేందుకు ఇది ఎంతో ఆస‌క్తిక‌రం. నేడు అపోలో ఫౌండ‌ర్స్ గా కార్పొరెట్ ఆస్ప‌త్రుల వ్యాపారంలో.. మెడిక‌ల్ బిజినెస్ ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలుగుతున్న‌ కామినేని ఫ్యామిలీ డివోష‌న‌ల్ జ‌ర్నీకి సంబంధించిన ఎంతో ఆస‌క్తి క‌లిగించే విష‌య‌మే ఇది.

మ‌హా శివ‌రాత్రి 2019 ని పుర‌స్క‌రించుకుని గ‌త కొంత‌కాలంగా ప్ర‌యాగ కుంభ‌మేళా వ‌ద్ద ఉపాస‌న చేస్తున్న సంద‌డి గురించి అంతే ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగుతోంది. అక్క‌డ అప‌రిచిత ప్ర‌జ‌లంతా ఉపాస‌న‌కు స్నేహితులు అయిపోయి ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోల్ని ఉపాస‌న ఇదివ‌ర‌కూ సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేశారు. ప్ర‌యాగ ఎంద‌రో కొత్త వారిని ప‌రిచ‌యం చేసింద‌ని ఉపాస‌న వ్యాఖ్యానించారు. కుంభ‌మేళా ప్రాంగ‌ణం ఎలా ఉంటుందో ఫోటోలు పంపించారు.

నిన్న‌టిరోజున మ‌హాశివ‌రాత్రి వేళ‌.. ఎంతో నియ‌మ‌నిష్ఠ‌ల‌తో శివుడికి పూజ‌లు ఆచ‌రించారు ఉపాస‌న - రామ్ చ‌ర‌ణ్ జంట‌. 800 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఆ పురాత‌న శివాల‌యంలో శివ‌లింగాన్ని శుభ్ర‌ప‌రిచి పూజ‌లాచ‌రిస్తూ చ‌ర‌ణ్ క‌నిపించారు. ఉపాస‌న త‌న పూర్వీకుల‌కు రిట్యువ‌ల్స్ స‌మ‌ర్పించారు. ఈ భ‌క్తి కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్ - ఉపాస‌న జోడీ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించారు. చ‌ర‌ణ్ తెల్ల పంచె తెల్ల చొక్కా ధ‌రించ‌గా..ఉపాస‌న తెలుపు రంగు దుస్తుల్లోనే శివునికి పూజ‌లు ఆచ‌రించారు. కుంభ‌మేళాలో చ‌ర‌ణోపాస‌నం ఎంతో ప్ర‌త్యేకంగా సాగిందని ఉపాస‌న షేర్ చేసిన‌ ఫోటోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది.