Begin typing your search above and press return to search.
అద్భుతమైన అందాల్లో మేమేకమైన చరణ్!
By: Tupaki Desk | 6 May 2022 10:45 AM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు విదేశాలు వెకేషన్ కి వెళ్లడం ఓ హాబీ. కోవిడ్ రాకతో వెకేషన్ స్పీడ్ వేగం తగ్గించారు. ఆ మధ్య కరోనా కాస్త తగ్గిన తర్వాత ఫీన్లాండ్ మంచు పర్వతాల్లో తేలారు. అంతకు ముందు 'వినయ విధేయ రామ' టైమ్ లో జార్జియాకు వెళ్లొచ్చిన మెగా కపుల్.. రీసెంట్ గానే ఫీన్లాండ్ కి వెళ్లొచ్చారు.
రాంచరణ్ - ఉపాసన కొణిదెల జంట తమ స్నేహితులతో కలిసి గత కొన్ని రోజుల పాటు ఫిన్ లాండ్ లో వెళ్ళి తెగ ఎంజాయ్ చేసారు. మెగా దంపతులు మరో కపుల్ తో కలిసి మంచులో చలి మంట కాచుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. మరో ఫొటోలో మంచు ప్రదేశాల్లో నిర్మించుకునే ఇగ్లూ గృహం ముందు చెర్రీ ఫోజ్ ఇచ్చారు. ఈ స్టైలిష్ పిక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత మంచు పర్వతాలను ఎంతో మిస్ అవుతున్నామని చరణ్ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. తాజాగా చరణ్ ఓ త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసారు. అందులో చరణ్ ఒక్కడే ఒంటరిగా మంచు పర్వతం పైకి ఎక్కినట్లు కనిపిస్తుంది. వింటర్ దుస్తుల్లోకి దూరిపోయి మంచు అందాల్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ కాసేపు ప్రశాంతమైన వాతవరణం నడుమ గడిపినట్లు తెలుస్తుంది.
ఇక మరో ఫోటోలో చరణ్ హోటల్ రూమ్ విండో నుంచి అద్భుతమైన అందాల్ని ఆస్వాదిస్తూ స్నాక్స్ తీసుకుంటున్నాడు. మరో పిక్ లో రోడ్డు పక్కన గార్డెన్ వైపు నుంచి వాక్ చేసుకుంటూ వస్తుండగా మంచు కొడల మధ్యలో నుంచి సూర్య కిరణాలు చరణ్ నడి నెత్తిన తాకడాన్ని గమనించవచ్చు . ఈవెకేషన్ లో ప్రతీ ఫోటోలో ఎంతో మనోహనరంగా కనిపిస్తున్నాడు.
ప్రకృతి అందాల్ని వర్ణించడం అయితే ఆసాధ్యమే. అంతటి అద్భుతమైన అందాల్లో చరణ్ మమేకమైపోయారు. మరి ఇవి ఫీన్లాండ్ ఫోటాలా? లేక వీటికి ఇంకేదైనా స్టోరీ ఉందా? అన్నది తెలియాలి. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారియి. స్పాట్ ఎక్కడ? ఏ దేశంలో ఫోటోలు దిగారు? అంటూ అభిమానులు అడుగుతున్నారు.
చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో చరణ్ కి జంటగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ సినిమా పూర్తిచేసిన వెంటనే 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.